NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

పైపాలెం రైతుల సమస్యలు పరిష్కరిస్తాం:జేసీ

1 min read

సమస్యలను శ్రద్ధగా విన్నా జేసీ-సోలార్ వల్ల రైతులకు ఇబ్బంది వద్దు

-సమస్యలు పరిష్కరించాలని జేసీ ఆదేశం..

మిడుతూరు (నందికొట్కూరు) న్యూస్​ నేడు  : పైపాలెం గ్రామంలో సోలార్ గ్రీన్ కో సంస్థ వారు చేస్తున్న పనుల పట్ల మీరు అధైర్య పడవద్దు మీ సమస్యలన్నీ పరిష్కరిస్తామని నంద్యాల జిల్లా జాయింట్ కలెక్టర్ సి.విష్ణు చరణ్ రైతులకు హామీ ఇచ్చారు. శుక్రవారం మధ్యాహ్నం మిడుతూరు మండల పరిధిలోని పైపాలెం గ్రామంలో మళ్లీ గ్రీన్ కో సోలార్ సంస్థ ప్రాజెక్ట్ నిర్మాణానికి 200 ఎకరాలు ప్రభుత్వ భూమి కావాలని అర్జీ పెంచడంతో జేసీ ప్రభుత్వ భూమిని మరియు మ్యాపును పరిశీలించారు. ఇండస్ట్రీ జీవో ప్రకారం రైతుల పొలాలకు వెళ్లే రోడ్లకు 40 అడుగులు పొదలాలి అలాగే పార్కులకు 10 శాతం రోడ్లకు వదలాలని జీవో చెబుతున్నప్పటికీ సోలార్ వాళ్లు అలాంటివి పట్టించుకోకుండా అడ్డదిడ్డంగా పనులు చేస్తూ ఉన్నారని వారికి ఎన్నిసార్లు చెప్పినా పట్టించుకోవడంలేదని రైతులు జాయింట్ కలెక్టర్ ను విన్నవించుకున్నారు.రైతులు చెప్పే ప్రతి విషయాన్ని జేసీ శ్రద్ధగా విన్నారు.నీటిపారుదల కోసం వదులుకున్న రోడ్లను కూడా సోలార్ వాళ్ళు తీసుకుంటూ ఉన్నారని రైతులు అన్నారు.రైతులు చెప్పిన ప్రతి విషయాన్ని పరిష్కరించాలని అంతేకాకుండా రోడ్లకు ప్రత్యేకంగా ఎల్పీ నెంబర్లు ఇచ్చి ఆమ్యాప్ ను నాకు త్వరలోనే అందజేయాలని ఆత్మకూరు ఆర్డీఓ డి.  నాగజ్యోతి మరియు తహసిల్దార్ శ్రీనివాసులును జేసీ ఆదేశించారు.సార్ మీరు మా సమస్యలను శ్రద్ధగా ఓపికగా వింటూ ఆ సమస్యలను పరిష్కరిస్తామని మీరు చెప్పడం మాకు చాలా సంతోషంగా ఉందని రైతులు జాయింట్ కలెక్టర్ కు కృతజ్ఞతలు తెలిపారు.ఈ కార్యక్రమంలో డీటీ శాన్వాజ్, మండల సర్వేయర్ కృష్ణుడు, వీఆర్ఓ సుందరాజు మరియు రైతులు జగన్ మోహన్ రెడ్డి, రామ లింగేశ్వర రెడ్డి,గిరిధర్ రెడ్డి,కేశాలు,ఇనాయతుల్ల,మర్రి రామేశ్వరుడు పాల్గొన్నారు.

About Author