NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

గాలికుంటు వ్యాధి నిరోధక టీకా ను ప్రారంభించిన ఎమ్మెల్యే కోట్ల

1 min read

ప్యాపిలి, న్యూస్​ నేడు:  ప్యాపిలి పట్టణ పశువైద్యశాలలో మంగళవారం పశువులకు  గాలికుంటు వ్యాధి నిరోధక టీకా కార్యక్రమాన్ని డోన్ శాసనసభ్యులు కోట్ల జయ సూర్య ప్రకాష్ రెడ్డి  ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కోట్ల మాట్లాడుతూ పశుసంవర్ధక రంగం రైతుల ఆర్థిక పరిస్థితి బలోపేతానికి ప్రధాన భూమిక వహిస్తుందని, పశువుల ఆరోగ్యం కాపాడేందుకు ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపడుతున్నట్లు వెల్లడించారు. గాలికుంటు వ్యాధి నిర్మూలన కోసం ఈ టీకా కార్యక్రమం ఎంతో ప్రయోజనకరమని, ప్రతి రైతు తన పశువులకు తప్పనిసరిగా టీకాలు వేయించుకోవాలని సూచించారు. కార్యక్రమంలో పశుసంవర్ధక శాఖ అధికారులు, స్థానిక ప్రజా ప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు రైతులు తదితరులు పాల్గొన్నారు.

About Author