NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

ఫిర్యాదులొస్తున్నాయ్.. పునరావృతం కాకూడదు

1 min read

రోగులను బయటికి పంపిస్తే చర్యలు..

నందికొట్కూరు ఎమ్మెల్యే జయసూర్య..

మిడుతూరు, న్యూస్​ నేడు: ఫిర్యాదులు వస్తున్నాయ్ వైద్య సిబ్బంది సమయపాలన లేదు రోగులను బయట ఆస్పత్రులకు పంపిస్తే కఠిన చర్యలు తప్పవని నందికొట్కూరు ఎమ్మెల్యే గిత్త జయసూర్య వైద్య సిబ్బందిని హెచ్చరించారు.నంద్యాల జిల్లా మిడుతూరు మండల కేంద్రంలోని సామాజిక ఆరోగ్య కేంద్రంలో మంగళవారం ఆసుపత్రిలో నూతన ఎక్స్ రే గదిని మరియు కంప్యూటర్లను ఎమ్మెల్యే ప్రారంభించారు. ముందుగా ఎమ్మెల్యేకు ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ తిరుపతి మరియు సిబ్బంది పుష్పగుచ్చంతో ఎమ్మెల్యేకు స్వాగతం పలికారు.  ముందుగా ఎమ్మెల్యే మాత్రలు పంపిణీ చేసే గదిలో ఉన్న మాత్రల తేదీలను పరిశీలించారు.రోగులతో ఎమ్మెల్యే ఆరోగ్య స్థితిగతులను అడిగి తెలుసుకున్నారు.రోగులకు మంచిగా వైద్యం అందించాలని సూచించారు.తర్వాత ఆస్పత్రి అభివృద్ధి కమిటీ సమావేశంలో ఎమ్మెల్యే పాల్గొన్నారు.ఇక్కడ వైద్య సేవలు బాగానే ఉన్నాయని కానీ కొన్ని ఫిర్యాదులు వస్తున్నాయని కానీ వాటిని మళ్లీ పున రావృతం కాకుండా చూసుకోవాలన్నారు.ఇక్కడ ఓపీ రోగులు పెరుగుతున్నారు మిగతా ఆసుపత్రుల్లో డెలివరీలు పెరుగుతూ ఉంటే ఇక్కడ ఎందుకు తగ్గుతున్నాయని ప్రశ్నించారు.  బయటికి డెలివరీలు పంపిస్తే చర్యలు తప్పవన్నారు.అంబులెన్స్ ఉంచుకునేందుకు 13 సెంట్ల స్థలం తీర్మాణ పత్రాన్ని ఎమ్మెల్యే మరియు తహసిల్దార్ శ్రీనివాసులు డాక్టర్ తిరుపతికి అందజేశారు.మినరల్ వాటర్ ప్లాంట్ కావాలని కోరగా ఎస్టిమేషన్ తయారు చేసిస్తే మంజూరు చేయిస్తానని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు.ఈ కార్యక్రమంలో మాండ్ర సురేంద్ర నాథ్ రెడ్డి,ఎస్సై ఓబులేష్, డాక్టర్లు భరత్,శారద,సాయి సుధా,సుష్మ,అశ్విన్ కుమార్, వీణా మరియు సిబ్బంది పాల్గొన్నారు.

About Author