NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

శివాలపల్లి వద్ద వెలసిన శ్రీ వీరభద్ర లక్ష్మీ నరసింహ స్వామి ఆలయం

1 min read

ఆలయాన్ని నిర్మించిన శివాలపల్లి వాసి పొట్టి పాటి ప్రతాపరెడ్డి

న్యూస్ నేడు చెన్నూరు : చెన్నూరు మండలం శివాల్ పల్లి జింకల వంక ఒడ్డున శ్రీ వీరభద్ర లక్ష్మీ నరసింహ స్వామి ఆలయం నిర్మాణ పనులు పూర్తిచేసుకుని భక్తులచే స్వామివారు పూజలు అందుకుంటున్నారు. కొన్ని సంవత్సరాలుగా పురాతన శ్రీ వీరభద్ర లక్ష్మీ నరసింహ స్వామి విగ్రహం జింకల వంకలో ఉండేది. శివాల పల్లి గ్రామానికి చెందిన పలువురు విగ్రహాన్ని ఒడ్డుకు చేర్చారు. ఆ దారిన వెళ్లే భక్తులు స్వామివారిని దర్శించుకునేవారు. అదే గ్రామానికి చెందిన పొట్టి పాటి ప్రతాప్ రెడ్డి విగ్రహానికి చిన్నపాటి పందిరి వేసి పూజలు నిర్వహించేవారు. స్వామివారి కృప అనుగ్రహించడంతో ప్రతాపరెడ్డి సోంత నిధులు తో 2023సంవత్సరం4వనేలలో ఆలయ నిర్మాణానికి శ్రీకారం చుట్టారు.20 లక్షలు ఖర్చుతో ఆలయ నిర్మాణ పనులు చేపట్టారు. ఇందుకోసం ఆర్లగడ్డ నుంచి నిర్మాణానిపుణులును పిలిపించి పనులను మొదలుపెట్టారు.ఆలయంగర్పగుడి గోపురం ముందు బాగం లో మంటపం తో పాటు ధ్వజస్థంబము. ఇతరపనులను 2025 ఆగస్టు 10 తేదీకి నిర్మాణ పనులు పూర్తి చేశారు. గత నెల 13. 14. తేదీ విగ్రహ ప్రతిష్ట మహోత్సవాలు నిర్వహించారు. శ్రీ వీరభద్ర లక్ష్మీనరసింహస్వామి. వినాయక విగ్రహ ప్రతిష్ట. ధ్వజస్తంభం ప్రతిష్ట. గోపురంపై కలిశా ప్రతిష్టా లనువేద పండితుల చేతుల మీదుగా పూజలు నిర్వహించి ప్రతిష్ట చేశారు. శివాలపల్లి . దగ్గర్లో ఉన్న మూడు గ్రామాల ప్రజలను ప్రతిష్ట రోజున ప్రతాప్ రెడ్డి ఆహ్వానించి భక్తులకు అన్నసంతర్పణ నిర్వహించారు. ఆలయం వద్ద విద్యుత్ సౌకర్యం త్రాగునీరు వసతి కల్పించారు. ఇంకా ఆలయ అభివృద్ధి పనులు చేపట్టవలసిందని శ్రీ వీరభద్ర లక్ష్మీ నరసింహ స్వామి నిర్వాహకులు పొట్టి పాటి ప్రతాప్ రెడ్డి పేర్కొన్నారు. ఆలయం చుట్టూ విశాలంగా ఏర్పాటు చేయవల సిఉంది. ఆలయం చుట్టూ ప్రహరీగోడ బండపరుపు. భక్తులు ప్రదర్శనలు చేసుకోవడానికి వీలుగా నిర్మాణాలు చేపట్టవలసి ఉందని తెలియజేశారు.ప్రతిష్టమహోత్సం 41రోజులు సంధ్బంగా ఈనేల 22 నా గాయిత్రి దేవి హోమంనిర్వహించడంజరుగుతుంది అనితెలిపారు.ఆలయంలో ప్రతి సోమవారం గురువారం అమావాస్య రోజు స్వామివారికి అత్యంత ప్రీతి పాత్ర మైన రోజులని అలాగే 9 వారాలు ఆలయం చుట్టూ తొమ్మిది ప్రదర్శనలు చేయడం వలన కోరిన కోరికలు నెరవేరుతాయి అని భక్తుల నమ్మకం.

About Author