NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేద్దాం

1 min read

-అధికారులు ప్రజాప్రతినిధుల సమన్వయంతో ఆదర్శ మండలంగా తీర్చిదిద్దుకుందాం

ఎం ఎల్ ఏ, పుత్తా చైతన్య రెడ్డి

చెన్నూరు , న్యూస్ నేడు: అధికారులు ప్రజా ప్రతినిధులు  గ్రామాలలో పర్యటించి సమగ్రంగా నివేదికలు తయారుచేసి ఆయా సమస్యలను పరిష్కరించే దిశగా కృషి చేద్దామని ఎమ్మెల్యే పుత్తా కృష్ణ చైతన్య రెడ్డి అన్నారు. మంగళవారం స్థానిక ఏపీ డి వో సభా భవనం నందు ఎంపీపీ చీర్ల సురేష్ యాదవ్ అధ్యక్షతన నిర్వహించిన సర్వసభ్య సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ, గ్రామాలలో ఎక్కడ కూడా త్రాగునీటి  సమస్య ఉండకూడదని, అలాగే గ్రామ ప్రజలు కూడా తమ వంతు పరిసర పరిశుభ్రత కొరకు చేయూతనివ్వాలని తెలిపారు. ఇంట్లో ముందర నీటి నిలువ ఉంచరాదని, డ్రైనేజీ కాలువలలో వ్యర్థాలను వేయరాదని ఆయన తెలిపారు. ఇలాంటి వారిపై అధికారులు చర్యలు తీసుకోవాలని ఆయన అన్నారు. అదేవిధంగా నాలుగు కోట్ల రూపాయలతో చేపట్టే చెన్నూరు సామాజిక ఆరోగ్య కేంద్రం పనులు అసంతృప్తిగా ఉండటం పట్ల ఆయన అధికారుల తీరుపై మండిపడ్డారు. వెంటనే పెండింగ్ పనులను పూర్తి చేసి సామాజిక ఆరోగ్య కేంద్రాన్ని అందుబాటులోకి తీసుకురావాలని ఆయన అధికారులకు తెలిపారు. నేషనల్ హైవే అధికారులు ప్రజా సమస్యలను పక్కన పెట్టారని సర్వీస్ రోడ్ల విషయంలో కానీ, డ్రైనేజీ విషయంలో కానీ, బస్ షెల్టర్ విషయంలో కానీ చాలా కాలం నుంచి ఆ డిపార్టుమెంటుకు చెపుతున్నప్పటికీ సరైన స్పందన లేదని కచ్చితంగా ఆ పనులు చేపట్టాలని లేకపోతే ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని నేషనల్ హైవే అధికారులను ఆయన హెచ్చరించారు. ఎంపీపీ చీర్ల సురేష్ యాదవ్ పీహెచ్సీ బిల్డింగ్ కు సంబంధించి రెండు కోట్ల రూపాయలు మంజూరు అయిందని దీనిని కొండపేట. కనపర్తి, బలిసింగాయపల్లె గ్రామాలకు అందుబాటులో ఉండే విధంగా నిర్మించేందుకు కృషి చేయాలని ఆయన ఈ సమస్యను ఎమ్మెల్యే దృష్టికి తీసుకురావడం జరిగింది. అదేవిధంగా గ్రామాలలో సిసి రోడ్లు ఏర్పాటుకు కృషి చేయాలని, రైతులకు యూరియా కొరత లేకుండా చూడాలని ఆయన ఈ సమస్యలను ఎమ్మెల్యేకు వివరించడం జరిగింది. కనపర్తి లే అవుట్ లలో నిర్మించే ప్రభుత్వ పక్క గృహ నిర్మాణాలు అసంపూర్తిగా నిలిచిపోయాయని వీటిపైహౌసింగ్ అధికారులు చొరవ తీసుకొని పూర్తి చేయాలని వెయ్యి మంది లబ్ధిదారులకు గృహ సదుపాయం కలుగుతుందని ఆయన తెలిపారు. అనంతరం ఎమ్మెల్యే పార్టీలకతీతంగా ప్రతి ఒక్కరూ మండల అభివృద్ధికి కృషి చేయాలని అన్ని శాఖల సమన్వయంతో మండలాన్ని ఆదర్శ మండలంగా తీర్చిదిద్దేందుకు కృషి చేయాలని మండలంలో ఏ సమస్య ఉన్న నాదృష్టికి తీసుకు వచ్చిన ఎడల వాటన్నిటి సత్వరమే పరిష్కారమయ్యేందుకు కృషి చేస్తానని అధికారులు ప్రజాప్రతినిధులు అందరు కూడా సమన్వయంగా పనిచేయాలని ఆయన తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కేసీ కెనాల్ డిస్ట్రిబ్యూటరీ చైర్మన్ తాటి గొట్ల వెంకటసుబ్బారెడ్డి, సొసైటీ అధ్యక్షులు ముండ్ల శ్రీనివాసులు రెడ్డి, ఎంఈఓ గంగిరెడ్డి, ఏపీవో శైలజ,  అగ్రికల్చర్ అధికారి కే శ్రీదేవి, వివిధ శాఖల అధికారులు, ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.

About Author