NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

బైక్ జాతా ను జయప్రదం చేయండి…

1 min read

యూటీఎఫ్ సీనియర్ నాయకులు అబ్దుల్ లతీఫ్

ప్యాపిలి,న్యూస్​ నేడు: యూటీఎఫ్ సభ్యత్వ నమోదులో భాగంగా మిగులు పాఠశాలల్లో సభ్యత్వ నమోదు కార్యక్రమం చేపడుతూ సెప్టెంబర్ 15 నుండి 19 వరకు యూటీఎఫ్ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు ఉపాధ్యాయులకు బోధనేతర పనుల నుండి విముక్తి కలిగించాలని,ఉపాధ్యాయులను బోధనకే పరిమితం చేయాలని అలాగే పిఆర్సీ కమిటీ నీ నియమించాలని,పెండింగ్ లో ఉన్న డిఏ లను తప్పక ప్రకటించాలని ,ఇప్పటికే రణభేరి బైక్ జాతా వివిధ జిల్లాల్లో విజయవంతంగా నిర్వహించబడుచిన్నదనీ మన డోన్ ప్రాంతానికి 19 వ తేదీ సాయంత్రం 5 గంటలకు సున్నపు బట్టిల వద్దకు వస్తున్నందున డోన్ ,ప్యాపలి యూటీఎఫ్ నాయకులు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని యూటీఎఫ్ సీనియర్ నాయకులు అబ్దుల్ లతీఫ్ ఉపాధ్యాయులకు పిలుపు నిచ్చారు.కార్యక్రమంలో ప్యాపలి మండల యూటీఎఫ్ అధ్యక్షులు రమేష్ నాయుడు,యూటీఎఫ్ మండల సహాధ్యక్షులు ఆంజనేయ ప్రసాద్ , యూటీఎఫ్ నాయకులు నరసింహయ్య,ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

About Author