NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

ఎన్‌సి‌డి 4 సర్వే ను  పరిశీలించిన డా. మహేశ్వర ప్రసాద్  

1 min read

కర్నూలు, న్యూస్​ నేడు: ఇందిరమ్మ హౌసెస్ పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్ర పరిధిలోని బాబా బృందావన నగర్ లో జరుగుచున్న ఎన్‌సి‌డి 4 సర్వే ను  అసంక్రమిత వ్యాధుల నియంత్రణ అధికారి డాక్టర్,మహేశ్వర ప్రసాద్  పరిశీలించినారు. అనంతరం  మాట్లాడుతూ   మారిన ఈ జీవన విధానంకారణంగావస్తున్న ప్రధానసమస్యఅధికరక్తపోటు, మధుమేహం, గుండెసంబంధితవ్యాధులు, పక్షవాతం,నోటి, గర్భాశయ,రొమ్ము క్యాన్సర్లను ముందస్తుగా  గుర్తించాలని సిబ్బందికి      తెలిపారు, సర్వే అసంక్రమణ వ్యాధుల నిర్ధారణ పరీక్షల స్క్రీనింగ్ పక్కగా నిర్వహించి అసంక్రమిత వ్యాధులపై ప్రజలకు    అవగాహన కల్పించాలని తెలిపారు..,   క్యాన్సర్ వ్యాధిపై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండడం వలన ఈ వ్యాధిబారిన పడకుండా జాగ్రత్త పడవచ్చునని అన్నారు.క్యాన్సర్ ను తొలి దశలోనే గుర్తించి చికిత్స అందిస్తే ఈ వ్యాధిని నియంత్రించవచ్చునని అన్నారు.   .క్యాన్సర్ పట్ల చిన్నపాటి లక్షణాలు కనిపించినా వెంటనే స్క్రీనింగ్ చేయాలని తెలిపారు. కర్నూలు  స్టేట్ క్యాన్సర్ ఆసుపత్రికి ప్రతి మంగళవారం,గురువారం ఓపి్ నంబర్ 222కు  రేఫర్ చేయాలని తెలిపారు.ఈ  కార్యక్రమములో  ఫ్లోరోసిస్ కన్సల్టెంట్ సుధాకర్ ,  ఆరోగ్య కార్యకర్త వెన్నెల,ఆషా కవిత మరియు ప్రొజెక్షనిస్ట్ ఖలీల్ పాల్గొన్నారు.

About Author