NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

శ్రీ స్వామివారికి శాస్త్రోకంగా పంచామృత అభిషేకం నిర్వహణ

1 min read

వివిధ సేవల,విరాళాల ద్వారా రూ:1,11,441/-లు ఆదాయం సమకూరినది

నిత్య అన్నదాన సత్రంలో భక్తులకు అన్న ప్రసాద వితరణ

ఏలూరు జిల్లా ప్రతినిధి న్యూస్​ నేడు  : గురవాయిగూడెం గ్రామములో తెల్ల మద్ది చెట్టు తొర్రలో స్వయంభువులై వెలిసిన శ్రీ మద్ది ఆంజనేయస్వామి వారి ఆలయంలో ప్రతి శనివారం నిర్వహించు అభిషేక సేవలో భాగంగా  ఈరోజు  ఆలయ ముఖమండపంపై స్వామివారి ఉత్సవమూర్తికి అర్చకస్వాములు శాస్త్రోక్తంగా పంచామృత అభిషేకం నిర్వహించారు.  ఈ కార్యక్రమంలో  అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. భక్తులు  ఆలయం చుట్టూ ప్రదక్షిణలు చేసి, స్వామివారిని దర్శించుకున్నారు. మద్యాహ్నం  వరకు  దేవస్థానమునకు వివిధ సేవల, విరాళాల  ద్వారా  రూ 1,11,441/-లు  సమకూరినది. స్వామివారి నిత్యాన్నదాన సత్రంలో  భక్తులు  అన్నప్రసాదం స్వీకరించారు. ప్రతి ఆదివారం ఉదయం గం.9.00 లకు  “హనుమద్ హోమం” నిర్వహిస్తున్నట్లు,హోమంలో పాల్గొన్న దంపతులకు వి‌ఐపిన దర్శనం,అనంతరం వేదాశీర్వచనం కల్పిస్తున్నట్లు  తెలిపారు.

About Author