శ్రీ స్వామివారికి శాస్త్రోకంగా పంచామృత అభిషేకం నిర్వహణ
1 min read

వివిధ సేవల,విరాళాల ద్వారా రూ:1,11,441/-లు ఆదాయం సమకూరినది
నిత్య అన్నదాన సత్రంలో భక్తులకు అన్న ప్రసాద వితరణ
ఏలూరు జిల్లా ప్రతినిధి న్యూస్ నేడు : గురవాయిగూడెం గ్రామములో తెల్ల మద్ది చెట్టు తొర్రలో స్వయంభువులై వెలిసిన శ్రీ మద్ది ఆంజనేయస్వామి వారి ఆలయంలో ప్రతి శనివారం నిర్వహించు అభిషేక సేవలో భాగంగా ఈరోజు ఆలయ ముఖమండపంపై స్వామివారి ఉత్సవమూర్తికి అర్చకస్వాములు శాస్త్రోక్తంగా పంచామృత అభిషేకం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. భక్తులు ఆలయం చుట్టూ ప్రదక్షిణలు చేసి, స్వామివారిని దర్శించుకున్నారు. మద్యాహ్నం వరకు దేవస్థానమునకు వివిధ సేవల, విరాళాల ద్వారా రూ 1,11,441/-లు సమకూరినది. స్వామివారి నిత్యాన్నదాన సత్రంలో భక్తులు అన్నప్రసాదం స్వీకరించారు. ప్రతి ఆదివారం ఉదయం గం.9.00 లకు “హనుమద్ హోమం” నిర్వహిస్తున్నట్లు,హోమంలో పాల్గొన్న దంపతులకు విఐపిన దర్శనం,అనంతరం వేదాశీర్వచనం కల్పిస్తున్నట్లు తెలిపారు.

