ఏలూరు జిల్లాలో నలుగురు హోమ్ గాడ్స్ పోలీసు కానిస్టేబుల్స్ గా సెలెక్ట్
1 min read

హోంగార్డులను సత్కరించి అభినంధించిన ఏలూరు జిల్లా ఎస్పీ కె.ప్రతాప్ శివ కిషోర్
కుటుంబ వివరాలు అడిగి తెలుసుకున్న ఎస్పీ
భార్య భర్తలు ఇరువురు ఒకరికొకరు చేదోడు వాదోడుగా ఉండాలని సూచన
ఏలూరు జిల్లా ప్రతినిధి న్యూస్ నేడు : ప్రభుత్వం వారు విడుదల చేసిన పోలీసు కానిస్టేబుల్ ఫలితాలలో ఏలూరు జిల్లా లో హోంగార్డులుగా పనిచేస్తూ కానిస్టేబుల్స్ గా సెలెక్ట్ అయిన 04 గురు హోంగార్డులు. ఈ రోజు శుక్రవారం నాడు ఏలూరు జిల్లా పోలీస్ ప్రధాన వారి కార్యలయం నందు జిల్లా ఎస్పీ కె. ప్రతాప్ శివ కిషోర్ ఐపీఎస్ కానిస్టేబుల్స్ గా సెలెక్ట్ అయిన హోంగార్డులతో సమావేశం అయ్యి వారితో మాట్లాడి వివరాలను తెలుసుకుని వారిని అబినంధించినారు.ఈ సంధర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ ముందుగా సెలెక్ట్ అయిన హోంగార్డు లు ఏం చదువుకున్నారు,వారికి టెక్నాలజీ పరంగా ఏం నేర్చుకున్నారు అనే విషయాలను అడిగి తెలుసుకున్నారు.కుటుంబ పరంగా వారి స్థితిగతులను గూర్చి అడిగి తెలుసుకున్నారు,పెళ్ళైన హోంగార్డుల యొక్క భార్యలు ఏం చదువుకున్నారు, ఉధ్యోగం చేసేవారు ఎంతమంది, అడిగి తెలుసుకుని మహిళలు కూడా జాబ్ చేసేలాగా వారిని ప్రోత్సహించాలని తద్వారా కుటుంబ పరిస్థితులు ఆర్ధికంగా మెరుగుపడి పిల్లలు ఉన్నత స్థాయిలకు చేరుకుంటారని పలు సూచనలు చేశారు.ఈ క్రమంలో సిబ్బంది ప్రతి ఒక్కరూ టెక్నాలజీ పరంగా సి.సి.కెమెరాల పర్యవేక్షణ, డ్రోన్స్ ఆపరేట్ చేయడం, సి.సి.టి.ఎన్.ఎస్., కంప్యూటర్ స్కిల్స్,సి.డి.ఆర్.అనాలసీస్ మొదలైన టెక్నాలజీ తెలిసి ఉండాలని, శిక్షాణ కేంద్రాలలో కొత్తగా వచ్చిన చట్టల పై పూర్తి అవగాహన కలిగి ఉండాలని, అన్నిటిలో మెరుగ్గా రాణించి సిబ్బంది రోల్ మోడల్ గా నిలవాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో హోంగార్డు ఆర్.ఐ.పవన్ కుమార్,ఆర్.ఎస్.ఐ భాస్కర రావు ఇతర పోలీసు అధికారులు పాల్గొన్నారు.

