5వ రోజు శ్రీ మహాలక్ష్మీ దేవి అలంకారంలో భక్తులకు దర్శనం
1 min read

ప్రత్యేక పూజలు నిర్వహించిన రెడ్డి అప్పల నాయుడు దంపతులు
ఏలూరుజిల్లా ప్రతినిధి న్యూస్ నేడు : శ్రీశ్రీశ్రీ దేవీ శరన్నవరాత్రుల మహోత్సవాలను పురస్కరించుకుని ఏలూరు నగరంలోని శ్రీ గంగా పార్వతీ దేవి సమేత శ్రీ జరాహరేశ్వర స్వామి వారి దేవస్థానం, మహిషాసుర మర్ధిని అమ్మవారి దేవస్థానం లో శుక్రవారం విశేష పూజా కార్యక్రమాలు నిర్వహించారు. దేవీ శరన్నవరాత్రుల మహోత్సవములో భాగంగా 5వ రోజు శ్రీ మహాలక్ష్మీ దేవి అవతారంలో మహిషాసుర మర్ధిని అమ్మవారిని అలంకరించారు.ఏపీఎస్ ఆర్టీసీ విజయవాడ జోనల్ చైర్మన్, ఏలూరు నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్‌చార్జి రెడ్డి అప్పలనాయుడు తన సతీమణి రెడ్డి అనురాధతో కలిసి భక్తి శ్రద్ధలతో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ పరిసరాలు వేదఘోషలతో మార్మోగగా, అమ్మవార్లకు నైవేద్యాలు, అర్చనలు, హారతులు సమర్పించారు. ప్రధాన అర్చకులు ఘంటసాల జయేంద్ర శర్మ వీరికి ఆశీర్వచనం అందించారు. ఈ సందర్భంగా పెద్ద సంఖ్యలో భక్తులు హాజరై అమ్మవారిని దర్శించుకున్నారు.ప్రత్యేక అతిథిగా హాజరైన రెడ్డి అప్పలనాయుడు దంపతులు అమ్మవారిని దర్శించుకుని కైంకర్యాలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ ఏలూరు దక్షిణపు వీధిలోని పోణంగి రోడ్డులో ఉన్న శ్రీ గంగా పార్వతీ దేవి సమేత శ్రీ జరాపహరేశ్వర స్వామి ఆలయంలో కొలువై ఉన్న శ్రీ మహిషాసుర మర్దిని అమ్మవారిని కుటుంబ సమేతంగా దర్శించుకున్నాము. “శ్రీశ్రీశ్రీ దేవీ శరన్నవరాత్రుల మహోత్సవాలు భక్తి, ఆధ్యాత్మికతకు ప్రతీకలు. రాష్ట్ర ప్రజలకు శాంతి, సమృద్ధి, సుఖసంతోషాలు కలగాలని, కూటమి ప్రభుత్వం ప్రజల సంక్షేమానికి కృషి చేయాలని సంకల్పంతో ఈ పూజలు చేశామని తెలిపారు. ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపరచడంలో కూటమి ప్రభుత్వం కృషి చేస్తోందని, ఆధ్యాత్మిక శక్తి అందులో బలాన్ని ఇస్తుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ కార్యనిర్వహణాధికారి పెన్మెత్స వెంకట కృష్ణంరాజు, స్థానిక నాయకులు చింత దుర్గేష్,నూకల సాయి వెంకట వరప్రసాద్,బోండా రాము నాయుడు,యడ్లపల్లి మమతా,పావని తదితరులు పాల్గొన్నారు.పూజా కార్యక్రమం అనంతరం భక్తులకు అమ్మవారి ప్రసాద వితరణ చేశారు.


