స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ..
1 min read

హొళగుంద న్యూస్ నేడు : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ విద్యా శాఖ మంత్రులు నారా లోకేష్ మరియు పౌర శాఖ మంత్రులు నాదండ్ల మనోహర్ ఆదేశాల మేరకుహోళగుంద లోస్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమం షాప్ నంబర్ 1324031 ఈబీసీ కాలనీ లో చేయడం జరిగింది. తెలుగుదేశం పార్టీ నియోజకవర్గ ఇన్చార్జి వైకుంఠంజ్యోతి మరియు స్టేట్ ఆర్గనైజింగ్ సెక్రటరీ వైకుంఠం శివప్రసాద్ ఆదేశాలతో టీడీపీ మండల కన్వీనర్ వీరన్నగౌడ్ మరియు జనసేన మండల కన్వీనర్ అశోక్ అధ్వరం లోఎన్డీఏ రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన స్మార్ట్ రేషన్ కార్డు పంపిణీ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. డీలర్ షాప్,వహీదా బేగము నందు.ఈ కార్యక్రమంలోతెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు పంపాపతి ,ఎర్రి స్వామి, డిఎస్ బాషా ,దీదీ వెంకటేష్, ద్వారకానాథ్ , కోగిలతోట జాకీర్ , సిబిఎన్ ఆర్మీ మొయిన్,దీదీ తిక్క స్వామి, అబ్దుల్ రెహమాన్, సుబాన్, ఇబైదుల్లా వైకుంఠం కార్యకర్తలు సచివాలయం సిబంది పాల్గొన్నారు.


