NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

రిలే నిరాహార దీక్షలో ఎనిమిదో రోజు

1 min read

నాయక కులస్తుల కు భరోసా కల్పించిన మాజీ ఎమ్మెల్యే ఘంటా మురళి

ఎంపీ,ఎమ్మెల్యే, ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళతా

ఏలూరుజిల్లా ప్రతినిధి  న్యూస్ నేడు : కామవరపుకోట మండలంలో నాయక కులస్తులు చేస్తున్నటువంటి రిలే నిరాహార దీక్షలు 8వ రోజు, మాజీ ఎమ్మెల్యే ఘంటా మురళి రామకృష్ణ, మరియు కొమరం భీం నాయక కులస్తులు కళ్ళకు నల్ల రిబ్బన్ కట్టుకొని మా కులస్తులకు వెంటనే న్యాయం చేయాలని, మా పిల్లలు చదువు కొనసాగించాలని,కోరగా స్థానిక మాజీ శాసనసభ్యులు  గంటా మురళి శిబిరాన్ని సందర్శించి మాట్లాడుతూ ఈ నాయక కులస్తులు పూర్వం నుంచి పోడు వ్యవసాయం చేసుకుంటూ,వేటాడుతూ, కూలి పనులు చేస్తూ జీవించేవారని మా అందరికి తెలిసినటువంటి విషయమే, అయినా సరే సర్టిఫికెట్స కొంతకాలం ఇవ్వడం, కొంతకాలం ఆపడం పిల్లలు చదువు ఆగిపోవడం చాలా అన్యాయమని అన్నారు. ఈ విషయాన్ని ఎంపీ, ఎమ్మెల్యే, ఉన్నతాధికారుల దృష్టిలోకి పెట్టి వారి సహకారంతో నాయక ఎస్టి సర్టిఫికెట్లు విచ్చే విధంగా కృషి చేస్తానని భరోసా కల్పిస్తూ తెలియజేశారు.నాయక కులస్తులకు ఎమ్మెల్యే, ఎంపీ, మాజీ ఎమ్మెల్యే,మాజీ ఏఎంసి చైర్మన్, మాజీ జెడ్పిటిసి,సర్పంచ్,మాజీ సర్పంచ్,కూటమి  ప్రభుత్వ నాయకులు ఇతర పార్టీ నాయకులు,వివిధ కుల సంఘాలు,అందరూ కూడా మాకు మద్దతు తెలియజేస్తున్నారు. అయినాసరే అధికారులు ఎనిమిదో రోజు కావస్తువున్న ఎటువంటి స్పందన లేదు  కాబట్టికొమరం భీం నాయక కులస్తులు ఈ సమస్య పరిష్కరించే అంతవరకు కొనసాగిస్తూ,అక్కడికి పరిష్కారం కాకపోతే ఆమరణ నిరాహార దీక్షలు కూడా కూర్చుంటామని తెలియజేస్తున్నారు.

About Author