ఆటో డ్రైవర్లకు అండగా రాష్ట్ర ప్రభుత్వం
1 min read

జిల్లాలో అర్హులైన 13,495 మంది ఆటో, మ్యాక్సీ క్యాబ్, మోటార్ క్యాబ్ డ్రైవర్ లకు “ఆటో డ్రైవర్ సేవలో” పథకం కింద ఆర్థిక సాయంగా రూ.20.24 కోట్లు జమ
జిల్లా కలెక్టర్ డా.ఏ.సిరి
కర్నూలు, న్యూస్ నేడు : రాష్ట్ర ప్రభుత్వం ఆటో డ్రైవర్లకు అండగా నిలుస్తూ, జిల్లాలో అర్హులైన 13,495 మంది ఆటో, మ్యాక్సీ క్యాబ్, మోటార్ క్యాబ్ డ్రైవర్ లకు “ఆటో డ్రైవర్ సేవలో” పథకం కింద ఆర్థిక సాయంగా రూ.20.24 కోట్ల రూపాయలను నేరుగా వారి ఖాతాలలోకి జమ చేసిందని జిల్లా కలెక్టర్ డా.ఏ.సిరి తెలిపారు. విజయవాడ నుండి “ఆటో డ్రైవర్ సేవలో” పథకం ద్వారా ముఖ్యమంత్రి రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 2,90,669 మంది ఆటో, మ్యాక్సీ క్యాబ్, మోటార్ క్యాబ్ డ్రైవర్ల ఖాతాల్లో ఒక్కొక్కరికి రూ.15 వేలు చొప్పున ఆర్థిక సాయంగా రూ.436 కోట్ల రూపాయల ఆర్థిక సాయం లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేశారు. జిల్లాలో ఈ కార్యక్రమాన్ని ప్రత్యక్ష ప్రసారం ద్వారా మున్సిపల్ కార్పొరేషన్ కాన్ఫరెన్స్ హాల్ నుండి ప్రజా ప్రతినిధులు, అధికారులు, లబ్ధిదారులు తిలకించారు.ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఆటో డ్రైవర్ లకు ఆటో ఫిట్నెస్ కోసం, ఆటో రిపేర్ ల కోసం, ఇన్సూరెన్స్ కోసం ఏడాదికి 15 వేల రూపాయలు ఇవ్వడం జరిగిందన్నారు..ఆటో డ్రైవర్ సేవలో ” పథకం ద్వారా కర్నూలు జిల్లాలో 13,495 మంది డ్రైవర్ లకు 20 కోట్ల రూపాయలను వారి ఖాతాలో జమ చేయడం జరుగుతోందని తెలిపారు.. సొంత ఆటో ఉండడంతో పాటు డ్రైవింగ్ లైసెన్స్, ఆధార్ కార్డు, రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్, రేషన్ కార్డు తదితర అర్హతలు ఉంటే ఈ పథకం కింద లబ్ధి చేకూరుతుందన్నారు.. ప్రభుత్వం ఇచ్చిన డబ్బుతో ఆటో రిపేర్ లు చేయించుకోవాలని, ట్రాఫిక్ రూల్స్ సక్రమంగా పాటించి ప్రయాణికులను భద్రంగా తీసుకొని వెళ్లి డ్రాప్ చేయాలని కలెక్టర్ ఆటో డ్రైవర్ లకు సూచించారు..కర్నూలు పార్లమెంట్ సభ్యులు బస్తిపాటి నాగరాజు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం సంక్షేమం – అభివృద్ధి లక్ష్యంగా పరిపాలన సాగిస్తోందన్నారు.. ప్రభుత్వం అధికారం లోకి వచ్చిన వెంటనే ఆర్ధిక పరిస్థితి బాగా లేనప్పటికి సూపర్ సిక్స్ పథకాలు వందశాతం అమలు చేస్తున్నామన్నారురూపాయల ఆర్థిక సాయం అందచేస్తే కూటమి ప్రభుత్వం 15 వేల రూపాయల ఆర్థిక సాయం అందిస్తుందన్నారు… స్త్రీ శక్తి పథకం కింద మహిళలు రాష్ట్రంలో ఎక్కడికైనా ఉచితంగా బస్సులో ప్రయాణం చేసే విధంగా పథకాన్ని ప్రవేశపెట్టడం జరిగిందన్నారు..20 వేల రూపాయలు వారి ఖాతాలో జమ చేయడం జరిగిందన్నారు… అన్న క్యాంటీన్ ల ద్వారా పేదలకు రుచికరమైన నాణ్యమైన భోజనం ఇవ్వడం జరుగుతుందన్నారు.సమావేశంలో డి సి ఎం ఎస్ చైర్మన్ నాగేశ్వర్ యాదవ్ , బొందిల్ల కార్పొరేషన్ చైర్మన్ విక్రమ్ సింగ్ , రజక కార్పొరేషన్ చైర్మన్ సావిత్రి , విశ్వబ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ పార్వతి , డి. టి. సి. శాంత కుమారి, జెడ్పి సి ఈ ఓ నాసర రెడ్డి , మున్సిపల్ కమిషనర్ విశ్వనాథ్ ,వివిధ కార్పొరేషన్ డైరెక్టర్లు , అధికారులు మరియు ఆటో డ్రైవర్లు పాల్గొన్నారు.

