వైద్యులు సమయపాలన పాటించాలి..
1 min read

కర్నూలు, న్యూస్ నేడు: వైద్యులు పని చేస్తున్నా దాన్ని ప్రజెంట్ చేయడం లేదు… డి.యం.ఇ డాక్టర్ రఘునందన్… ప్రభుత్వ వైద్యులు పనిచేస్తున్నా సాంకేతికంగా దాన్ని ప్రజెంట్ చేయడం లేదని ముఖ్యంగా ప్రతి కేసు కు ఆయుష్మాన్ భారత్ ఐడి నమోదు పూర్తి స్థాయిలో చేయడం లేదని దీని వల్ల చేసిన పని కూడా సాంకేతికంగా చూపించ లేక పోతున్నామని కావున కేసు విషయంలో ప్రతి సాంకేతిక అంశాన్ని మరువ కూడా నమోదు చేసి అప్లోడ్ చేయాలని డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ డాక్టర్ రఘునందన్ వైద్యులకి సూచన చేశారు. సోమవారం డి.యం.ఇ స్టేట్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ సందర్శనకు కర్నూలు కు విచ్చేసిన సందర్భంగా మెడికల్ కాలేజీ ప్రిన్సిపల్ ఛాంబర్ లో అన్ని విభాగాల అధిపతులతో ముఖ్య అంశాలపై చర్చింటం జరిగింది.ఈ కార్యక్రమంలో వైస్ ప్రిన్సిపల్ లు డాక్టర్ సాయి సుధీర్,డా. హరిచరణ్, డా. రేణుకాదేవి, డా. విజయనంద్ బాబు, డా. సింధియా శుభప్రద తో పాటు అన్ని విభాగాల అధిపతులు పాల్గొన్నారు.

