NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

జీఎస్టీ మార్పులపై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలి

1 min read

వాణిజ్య పన్నులశాఖ జాయింట్ కమిషనర్ నాగార్జునరావు

ఏలూరుజిల్లా ప్రతినిధి న్యూస్​ నేడు  : ఏలూరులోని జిల్లా ప్రధాన ప్రభుత్వ ఆసుపత్రిలో  జీఎస్టీ 2.O పై వాణిజ్య పన్నుల శాఖ జాయింట్ కమీషనర్ నాగార్జునరావు అధ్యక్షతన ఆసుపత్రుల ప్రతినిధులు,ఫార్మసీ ఏజెన్సీస్, భీమా ప్రతినిధులతో అవగాహన కార్యక్రమం జరిగింది. కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి డా: పి.జె.అమృతం మాట్లాడుతూ ప్రాణాధార ఔషదాలు,జీవిత, ఆరోగ్య భీమాలపై పూర్తిస్థాయిలో జీఎస్టీ తొలగించారన్నారు.ప్రతీ ఒక్కరూ ఆరోగ్య భీమా తీసుకోవాలన్నారు. సాధారణ మందులు,టెస్టింగ్ కిట్లపై జీఎస్టీ 5 శాతానికి తగ్గిందని, ఆసుపత్రులు,ల్యాబ్ లకు సంబంధించి పరికరాలపై కూడా 5 శాతానికి జీఎస్టీ తగ్గిందన్నారు.వాణిజ్య పన్నుల శాఖ జాయింట్ కమీషనర్ నాగార్జునరావు మాట్లాడుతూ జీఎస్టీ మార్పులపై ప్రతీ ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలన్నారు.ప్రజల కొనుగోలు శక్తిని పెంచేందుకు కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు జీఎస్టీ ని తగ్గించాయని,జీఎస్టీ ఫలాలను ప్రతీ పొందాలన్నారు. కార్యక్రమంలో ప్రభుత్వ ఆసుపత్రి డిప్యూటీ సూపరింటెండెంట్ డా:వంశీ,డిఐఓ డా:సిబ్బ, డా: పద్మావతి, ప్రభృతులు పాల్గొన్నారు.

About Author