NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

ప్రధాని నరేంద్ర మోదీ  పర్యటనను విజయవంతం చేద్దాం

1 min read

రాష్ట్ర హజ్ కమిటీ సభ్యులు సూరి మన్సూర్ అలీ ఖాన్

కర్నూలు, న్యూస్ నేడు:  కర్నూలు పట్టణంలోని తెలుగుదేశం పార్టీ అసెంబ్లీ కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించబడింది.ఈ సందర్భంగా సూరి మన్సూర్ అలీ ఖాన్ మాట్లాడుతూ అక్టోబర్ 16న ప్రధాని నరేంద్ర మోడి , రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు , ఉప ముఖ్యమంత్రి  పవన్ కళ్యాణ్ కర్నూలు పర్యటనకు రావడం మన జిల్లాకు మైలురాయిగా నిలవనుందని కూటమి ప్రభుత్వం జీఎస్టీ స్లాబులను తగ్గించి వ్యాపారవేత్తలకు, పేద మరియు మధ్య తరగతి ప్రజలకు ఊరట కల్పించడంతో ప్రజల సంక్షేమమే కూటమి ప్రభుత్వ ధ్యేయమని మరోసారి రుజువయ్యిందన్నారు.మ‌న ప్రాంతం అభివృద్ధి కోసం ఇప్పటికే కేంద్ర ప్రభుత్వ స‌హ‌కారంతో రాష్ట్ర ప్రభుత్వం ఎంతో కృషి చేస్తుందని, ప్రత్యేకంగా క‌ర్నూలు అభివృద్ధి కోసం మంత్రివర్యులు టిజి భరత్ ఎంతో కృషి చేస్తున్నారని అన్నారు.

About Author