ప్రధాని పర్యటన సందర్భంగా తాత్కాలిక హెల్త్‌కేర్ ఆసుపత్రి ఏర్పాట్లు
1 min read

కర్నూలు, న్యూస్ నేడు: ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ జిల్లాలో పర్యటించనున్న సందర్భంగా నన్నూరు టోల్ గేట్ దగ్గర ఉన్న రాగమయూరిలో తాత్కాలిక హెల్త్‌కేర్ ఆసుపత్రి ఏర్పాట్లను మరియు సదుపాయాలను పరిశీలించిన ప్రోగ్రాం స్పెషల్ ఆఫీసర్, సీనియర్ ఐఏఎస్ అధికారి వీరపాండియన్, మాట్లాడుతూ:-వేదిక వద్ద ఉన్న ఆసుపత్రిని పరిశీలించారు. అనంతరం విద్యుత్ సౌకర్యాలు, వైద్య పరికరాలు, తాగునీటి సదుపాయం, మెడికల్ ఎక్విప్మెంట్ సదుపాయాలు వంటి అంశాలను సమన్వయం చేసి, అన్ని ఏర్పాట్లను పరిశీలించినట్లు తెలిపారు.ఆసుపత్రి సూపరెండెంట్ పర్యవేక్షణలో జరుగుతున్న వైద్య సేవల పనులు సంతృప్తికరంగా ఉన్నట్లు తెలిపారు.రేపు జరగబోయే ప్రధాన మంత్రి మరియు ముఖ్య మంత్రి ల మహాసభ సందర్భంగా, వైద్య బృందం తరఫున అవసరమైన అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి అని అన్నారు.ఈ కార్యక్రమానికి డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్, డా.రఘునందన్, కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాల సూపరిండెంట్, డా.వెంకటేశ్వర్లు ఆసుపత్రి ఇంచార్జ్ సిఎస్ఆర్ఎం ఓ, డా.వెంకటరమణ, టిడిపి డాక్టర్స్ వింగ్ కమిటీ సభ్యులు, డా.శివ ప్రసాద్, డా. సంజీవ్ కుమార్ సిం (మాజీ పార్లమెంట్ సభ్యుడు, డా. శ్రీనివాస్, డా.హిమబిందు అసిస్టెంట్ ప్రొఫెసర్ డా.కిరణ్ కుమార్, తదితరులు పాల్గొన్నారు.

