NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

అనుమతి లేని లేఔట్ లపై చర్యలు తప్పవు..

1 min read

ప్రభుత్వ ఆదాయానికి గండి కొడితే సహించేది లేదు…

కుడా చైర్మన్ సోమిశెట్టి వెంకటేశ్వర్లు…..-

హొళగుంద న్యూస్ నేడు : ఎలాంటి అనుమతి లేని అక్రమ లేఔట్ లపై చర్యలు తప్పవని కర్నూల్ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ (కుడా) చైర్మన్ సోమిశెట్టి వెంకటేశ్వర్లు హెచ్చరించారు.గురువారం హోళగుంద మండల కేంద్రంలోని అనుమతి లేని లేఔట్ లపై విచారించారు.హోళగుంద మండల కేంద్రంలో 13 అక్రమ లేఔట్ లు గుర్తించామని తెలిపారు.అనుమతి లేకుండా లేఅవుట్ వేసి ప్లాట్లు అమ్ముకుంటున్న వారికి నోటీసులు అందజేస్తామని అన్నారు. నోటీసులు అందుకున్న వారు పది రోజులలో కుడా అప్రూవల్ పొందాలని లేనిపక్షంలో అప్రూవల్ లేని లేఅవుట్లను వేసిన వారిపై కేసులను నమోదు చేసి, చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. పంచాయితీ కార్యదర్శులు తమ తమ పంచాయితీ పరిధిలో  అక్రమ లేఔట్లను గుర్తించి వాటిని లేఅవుట్లుగా మార్చేందుకు చర్యలు తీసుకోవాలని సూచించామన్నారు.ప్రజలు అనుమతి లేని లేఔట్లలో ప్లాట్లు కొని మోసపోవద్దని అన్నారు. అప్రూవల్ లేని లే అవుట్ల యందు ప్లాటు కొనడం వల్ల త్రాగునీరు, వీధి దీపాలు,డ్రైనేజీ, బ్యాంకు లోన్ వంటి సదుపాయాలు పొందలేరని అన్నారు. దీనిపై పంచాయతీ పరిధిలో కరపత్రాలు, గోడపత్రికలు, మైకు ప్రచారాల ద్వారా ప్రజలకు అవగాహన కల్పిస్తామన్నారు. ప్రభుత్వ నిబంధనలకు అనుసరించి లేఅవుట్ అప్రూవల్ చేయించుకోవాలని అన్నారు.నిబంధనల ప్రకారమే ప్లాట్లు ఏర్పాటు చేసి,విక్రయాలు చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో మేజర్ పంచాయతీ కార్యదర్శి రాజశేఖర్ గౌడ్,సర్పంచ్ తనయుడు పంపాపతి, కుడా సిబ్బంది తదితరులు  పాల్గొన్నారు.

About Author