NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

రాష్ట్రస్థాయి ఎస్జీఎఫ్ పోటీలకు ఎస్.ఎన్.ఎస్ స్కూల్ విద్యార్థులు

1 min read

ఐదు మంది విద్యార్థులు ఎంపికవ్వడం చాలా ఆనందంగా ఉంది : శోభారాణి

ఎమ్మిగనూరు న్యూస్ నేడు : ఎమ్మిగనూరు పట్టణంలో గత మూడు రోజులుగా కర్నూలు జిల్లా ఔట్ డోర్ స్టేడియంలో జరిగిన స్కూల్‌గేమ్స్‌ ఫెడరేషన్ ఆఫ్‌ ఇండియా అండర్ – 14, 17, 19 ఫుట్ బాల్, బాస్కెట్ బాల్, ఖోఖో జిల్లాస్థాయి పోటీలలో ఎమ్మిగనూరు పట్టణానికి చెందిన ఎస్.ఎన్.ఎస్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో చదువుతున్న తొమ్మిదవ తరగతి విద్యార్థి అండర్-19 విభాగంలో ముల్లామాబు, అండర్ -17 విభాగంలో ఎనిమిదవ తరగతి విద్యార్థిని షర్మిల, అండర్ -14 విభాగంలో తులసి, నిహారిక, మోహన్ లు తమ ఆటలలో వ్యక్తిగత ప్రతిభను చాటి రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికయ్యారని  పాఠశాల ప్రధానోపాధ్యాయులు శోభారాణి గురువారం మీడియా కు తెలిపారు. మా పాఠశాల నుండి ఐదు మంది విద్యార్థులు రాష్ట్రస్థాయికి ఎంపికవ్వడం చాలా ఆనందంగా ఉందన్నారు. విద్యార్థుల ఎంపికపట్ల వ్యాయామ ఉపాద్యాయులు వెంకటేష్, బసవరాజు, సృజనకుమారి ల కృషి ఎంతో ఉందని కొనియాడారు. ఫుట్ బాల్ ఆటలో మంచి ప్రతిభను కనబరిచిన తులసి అనే విద్యార్థినికి ఊరుకుందాచారి బూట్లు పంపిణీ చేయడం అభినందనీయమన్నారు. ఈ కార్యక్రమంలో టీచర్లు మహబూబ్ బాష, కరేకృష్ణ, సత్యనారాయణ, లోకేష్, మాణిక్యమ్మ, ఉరుకుందాచారి, తిమ్మప్ప, ఖాజా, తదితరులు పాల్గొన్నారు.

About Author