సురక్ష ఆప్ ను ఉపయోగించడం వలన మద్యం నాణ్యత తెలుస్తుంది
1 min read

కర్నూలు, న్యూస్ నేడు: కర్నూలు జిల్లా ప్రొహిబిషన్ మరియు ఎక్సైజ్ స్టేషన్ ల పరిధిలోని మొత్తం వైన్ షాపులు మరియు బార్లు మొత్తం అమ్మకాలు రెండు కోట్ల 32 లక్షల 30 వేల 335 రూపాయలు అందులో 1,43,346 బాటిల్లను స్కాన్ చేసి పై మొత్తము అమ్మకాలు చేయడం జరిగింది. ఇవన్నీ కూడా ఎక్సైజ్ సురక్ష ఆప్ ద్వారా సాధ్యమైనది వినియోగదారులకు సురక్ష ఆప్ అందుబాటులో ఉంచడం నిమిత్తం ప్రభుత్వం వారు ప్రతి ఒక్క షాపు నందు క్యూ ఆర్ కోడ్ ను ఏర్పాటు చేసి ఒక కార్డు బోర్డును ప్రతి షాపు ముందు ఏర్పాటు చేయడం జరిగినది. వినియోగదారులు అందరికీ కూడా అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేసి సురక్ష ఆప్ ను ఉపయోగించడం వలన మద్యం నాణ్యతను తెలియజేయుటకు ఉపయోగపడుతుందని కావున ప్రతి వినియోగదారుడు సదరు మద్యం బాటిల్ ఎక్కడి నుంచి వచ్చినది అన్నది సులభంగా తెలుసుకొనుటకు వీలు కలిగే విధంగా సురక్ష ఆప్ ను ప్రతి షాపు నందు అందుబాటులో ఉండే విధంగా ప్రభుత్వం వారు ఏర్పాటు చేయడం జరిగినది. కావున ప్రతి ఒక వినియోగదారుడు క్యూఆర్ కోడ్ ను ఉపయోగించుకొని అప్ ద్వారా మద్యం యొక్క నాణ్యత మరియు ఎక్కడి నుంచి వచ్చినది పూర్తి వివరాలు తెలుసుకునే అవకాశం కల్పించడం జరిగినది. ఈ అవగాహన కార్యక్రమంలో జిల్లా ప్రొహిబిషన్ మరియు ఎక్సైజ్ అధికారి ఎం సుధీర్ బాబు అసిస్టెంట్ ప్రొహిబిషన్ మరియు ఎక్సైజ్ సూపరింటెండెంట్ ఆర్ రామకృష్ణారెడ్డి ప్రొహిబిషన్ మరియు ఎక్సైజ్ ఇన్స్పెక్టర్ చంద్రహాస్,సబ్ ఇన్స్పెక్టర్ దుర్గా నవీన్ బాబు మరియు సిబ్బంది పాల్గొని వినియోగదారుడికి యాప్ ఎలా ఉపయోగించుకోవాలి అనే విధి విధానాలను తెలియజేయడం జరిగినది కస్టమర్లు ఉత్సాహంగా ప్లే స్టోర్ కి వెళ్లి యాప్ ను డౌన్లోడ్ చేసుకొని తాను కొన్న బాటిల్ సరియైనదే అని నిర్ధారణ చేసుకొని సంతోషించడం జరిగినది.

