NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

 చుక్కల భూములకు పరిష్కారం చూపించండి ..

1 min read

వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు బి వీరశేఖర్

పత్తికొండ, న్యూస్​ నేడు:   మండలంలో ప్రైవేట్ భూములను కూడా చుక్కల భూములుగా, ప్రభుత్వ భూములుగా చూపిస్తూ రైతులకు రెవిన్యూ పరంగా తీవ్ర ఇబ్బందులు గురిచేస్తున్నారని వెంటనే చుక్కల భూమల  సమస్యను పరిష్కరించాలని వ్యవసాయ కార్మికు సంఘం జిల్లా అధ్యక్షులు బి వీరశేఖర్ డిమాండ్ చేశారు. ఈ మేరకు సోమవారం  నాడు ఆయన స్థానిక తాసిల్దార్ కు పాలకుర్తి , తర్నేకల్ గ్రామాల రైతులతో కలిసి సంబంధిత సమస్యపై వినతి పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, కొనుక్కున్న భూములు మరియు వారసత్వంగా వచ్చిన భూములను కూడా రెవెన్యూ అధికారులు చుక్కల భూములుగా చూపించడం వలన రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. ఈ కారణంగా రైతులు బ్యాంకు రుణాలుపొందలేకపోతున్నారని,  అదేవిధంగా ప్రభుత్వం నుండి వచ్చే రాయితీలను రైతులు అందుకోలేకపోతున్నారని వారు పేర్కొన్నారు. కావున వెంటనే ప్రభుత్వము అధికారులు స్పందించి చుక్కల భూముల నుండి శాశ్వత పరిష్కారం చూపించాలని పదే, పదే ప్రభుత్వ కార్యాలయం చుట్టూ రైతులు తిరగలేక పోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. చుక్కల భూముల పట్ల రెవెన్యూ అధికారులు తీవ్ర నిర్లక్ష్యం వహిస్తున్నారని పదేపదే రైతులను అధికారులు ఇబ్బందులకు గురిచేస్తే తాసిల్దార్ కార్యాలయం ను రైతులతో కలిసి ముట్టడిస్తామని ఆయన హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ కార్మిక సంఘం సీనియర్ నాయకులు యూసుఫ్ భాష, సిఐటియు మండల కార్యదర్శి అశోక్, ఆయా గ్రామాల రైతులు మరియు ప్రజాసంఘాల నాయకులు సుధాకర్, రవీంద్ర, లింగన్న, లోకయ్య, ఏసోబు, చిట్టెమ్మ, లింగమయ్య, రామన్న, వెంకటేశులు, లక్ష్మన్న తదితరులు పాల్గొన్నారు.

About Author