వేరుశనగ మిషన్ కిందపడి మహిళ దుర్మరణం, ఇద్దరు పిల్లలకు తీవ్ర గాయాలు
1 min read

పత్తికొండ, న్యూస్ నేడు: పత్తికొండ మండలం పందికోన గ్రామంలో ప్రమాదవశాత్తు వేరుశనగ మిషన్ కింద పడి మహిళ దుర్మరణం చెందగా, ఆమె ఇద్దరు పిల్లలు తీవ్రంగా గాయపడ్డారు. వేరుశెనగ పంట నూర్పిడి చేసిన అనంతరం బండి పై వస్తుండగా ప్రమాదవశాత్తు బండి వాట పడింది. బండి పై ఉన్న అనుమంతు భార్య సరస్వతి 45 సం.లు. వేరుశెనగ మిషన్ కింద పడి మృతి చెందింది. అలాగే ఆమె ఇద్దరు పిల్లలు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాదంలో గాయపడిన వారిని స్థానిక ప్రభుత్వ వైద్యశాలకు చికిత్స కోసం తీసుకురాగా అప్పటికే సరస్వతి మృతి చెందింది. తీవ్రంగా గాయపడిన ఆమె ఇద్దరు పిల్లలను ప్రధమ చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

