NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

పార పట్టిన ఆర్టీసీ డ్రైవర్..రోడ్డు గుంతలు మాయం

1 min read

మిడుతూరు, న్యూస్​ నేడు: రోడ్డు గుంతలుపూడ్చడానికి ఆర్టీసీ డ్రైవర్ పార పట్టిన సందర్భాలు ఎక్కడైనా ఉన్నాయా..?గ్రామ ప్రజలకు లేని ఆలోచన ఆర్టీసీ డ్రైవర్ కండక్టర్ కు వచ్చిందా.. అంటే అవుననే చెప్పవచ్చు. వివరాల్లోకి వెళ్తే నంద్యాల జిల్లా మిడుతూరు మండల పరిధిలోని 49 బన్నూరు గ్రామంలో ఎస్సీ కాలనీలో సోమవారం ఈ సంఘటనతో కాలనీ మరియు గ్రామ ప్రజలు ఆశ్చర్య పోయారు.కర్నూలు-2 డిపోకు చెందిన(ఏపి 21 జడ్ 0548) అను ఆర్టీసీ బస్సు కర్నూలు నుండి దేవనూరు గ్రామానికి ఉ 8:45 కు వెళ్తుండగా ఆర్టీసీ డ్రైవర్,కండక్టర్ మరియు పాఠశాలకు వెళ్తున్న విద్యార్థులు కలిసి మట్టిని తీసి గుంతకు మట్టి వేశారు. చూసిన ప్రజలు కాలనీవాసులు హర్షం వ్యక్తం చేస్తూ అభినందించారు.ఈ రోడ్డు మిడుతూరు-ఓర్వకల్లు రోడ్డు భారీ వాహనాలు వెళ్లడంతో రోడ్డు గుంతలు గుంతలుగా ఉండటంతో ప్రయాణికులు కాలనీవాసులు ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా ఆర్ అండ్ బి అధికారులు ప్రమాదాలు జరగకుండా గుంతలు పూడ్చాలని గ్రామస్తుల కోరుతున్నారు.

About Author