అధిక వర్షాలు ఉన్న నేపధ్యంలో రైతులు ఈ క్రింది జాగ్రత్తలు తీసుకోవాలి
1 min read

హొళగుంద న్యూస్ నేడు : రాబోయే 4 రోజులు (27, 28, 29, 30) అధిక వర్షాలు ఉన్న నేపధ్యంలో హోళగుంద మండలంలోని వరి, పూర్తి పత్తి మరియు ఇతర పంటలు పండించే రైతులు ఈ క్రింది జాగ్రత్తలు తీసుకోవాలి. పొలంలో మురుగు కాలువలు ఏర్పాటు చేసి, నీటిని వేంటనే తీసివేయాలి. నీటిని తొలగించిన తర్వాత గింజ రంగు మారకుండా, పొడ తెగులు, మునిపండు తెగులు రాకుండా. నివారించడానికి ఎకరానికి ప్రొఫికొనజోల్ 25 EC – 200 ml లేదా వెంక్సాకొనజోల్ 5 sp- 400 m) పిచికారీ చేసుకోవాలి. పొలంలో మురుగు కాలువలు ఏర్పాటు చేసి, అగిన నీటిని వేంటనే తీసివేయాలి. తుఫాను ఉన్న ఈ నాలుగు రోజులు పత్తి తీయడం చేయరాదు. ఒకవేళ చేసిన తేడి పత్తిని బాగా ఆరబెట్టిన తర్వాతనే మంర్కెట్కు తరలిస్తే మంచి గిట్టుబాటు ధర రైతుకు అందుతుంది. పత్తి తీయడం కూడా ఉదయం 10 గంటల తర్వాత లేదా బాగా ఎండ కాసిన టైంలోనే తీసుకొవాలి. ఆకుపచ్చ, కాయకుళ్ళు తెగులు నివారణకు మంంకోజెబ్ 3 గ్రా లేటరు నీటికి, కాపర్ ఆక్సిక్లోరైడ్ 3 గ్రా. లేటరు నీటికి కలిపి మార్చి, మార్చి పిచికారి చేయాలి. ఆకు పచ్చ తెగులు మాత్రమే గమనిస్తే (ప్రాపికొనజోల్ 1 మి.లీ. లేటరు నీటికి కలిపి పిచికారి చేయాలి పంత, కాయలు రాలితే నాఫ్టాలిన్ అసిటిక్ యుసిడ్ (ప్లానోఫిక్స్) 0.25ml. లీటరు నీటిని కలిపి పిచికారీ చేయాలి.

