ఇలాగైతే రోగాలు వస్తే ఎవరు బాధ్యత..?
1 min read

గ్రామాల్లోనే చెత్తాచెదారంతో దుర్వాసన
చోద్యం చూస్తున్న అధికారులు..
మిడుతూరు, న్యూస్ నేడు: ముందే వర్షాకాలం మురుగు నీ రు రోడ్లపై నిల్వ ఉన్నా, చెత్తాచెదారంతో డ్రైనేజీ కాలువల్లో నిండిపోతూ ఉన్నా వీటిని శుభ్రం చేయించాల్సిన అధికారులు పట్టించుకోరు. మరి ఈ రోగాలు వస్తే ఎవరు బాధ్యత.?నంద్యాల జిల్లా మిడుతూరు మండలంలో 19 గ్రామ పంచాయతీలు(మజారా కలిపి 24 గ్రామాలు)ఉన్నాయి. గ్రామాల్లో ఇలాంటివి కళ్ళకు అద్దంలో కళ్ళకు అద్దంలా కనపడుతున్నా అధికారులు పట్టించుకోరా అంటూ వివిధ గ్రామాల ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.వర్షాకాలం సీజన్ మురికి కాలువలు మురుగునీరుతో దోమలు విపరీతంగా ప్రబలడంతో దోమల నుండి రోగాల బారిన పడుతున్నామని గ్రామాల్లో ఎక్కడ కూడా దోమలను రూపుమాపేందుకు సాయంత్రం ఫాగింగ్ మిషన్ తో పొగను వదులుతున్న సందర్భాలు లేవని వివిధ గ్రామాల ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు దోమలను రూపుమాపేందుకు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.అంతేకాకుండా దేవనూరు గ్రామం మైనార్టీ కాలనీలో సీసీ రహదారిపై మురుగునీరు నిల్వ ఉండటంతో విద్యార్థులు కాలనీ ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని పంచాయతీ కార్యదర్శికి ఎన్నిసార్లు చెప్పినా పట్టించుకోవడంలేదని కాలనీ మైనార్టీ మహిళలు ఆగ్రహం వ్యక్తం చేశారు.గ్రామాల్లోనే చెత్తాచెదారం దుర్వాసన వస్తుందనిఇప్పటికైనా గ్రామాలను శుభ్రంగా ఉంచేందుకు అధికారులు దృష్టి సారించాలని గ్రామాల ప్రజల కోరుతున్నారు.

