బస్సు ప్రమాద బాధితులకు ఆర్థిక సాయం
1 min read

19 మందికి రూ. 38 లక్షలు
గాయ పడిన వారికి రూ. 2 లక్షలు
కర్నూలు, న్యూస్ నేడు : ఈ నెల 24వ తేదీన చిన్నటేకూరు సమీపంలో జరిగిన బస్సు ప్రమాద దుర్ఘటన బాధితులకు కావేరి ట్రావెల్స్ యాజమాన్యం రూ.40 లక్షలు ఆర్థిక సాయం అందజేశారు. గురువారం ఉదయం కలెక్టర్ ఛాంబర్ లో కావేరి ట్రావెల్స్ ప్రతినిధులు రాష్ట్ర పరిశ్రమలు, వాణిజ్యం, ఫుడ్ ప్రాసెసింగ్ మంత్రి టి.జి భరత్ , జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ.సిరి , ఎస్పీ విక్రాంత్ పాటిల్ ,జాయింట్ కలెక్టర్ నూరుల్ కమర్, పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరిత రెడ్డి సమక్షంలో బస్సు దుర్ఘటనలో మరణించిన మరియు గాయపడిన వారికి చెక్కు రూపంలో మంత్రికి అందజేశారు.చిన్నటేకూరు సమీపంలో ఈ నెల 24 న జరిగిన కావేరీ బస్సు దుర్ఘటన లో మరణించిన వారికి రెండు లక్షల రూపాయల చొప్పున 17 మంది పెద్దవారు , ఇద్దరు చిన్న పిల్లలు మొత్తం 19 మందికి రూ.38 లక్షలు , తీవ్రంగా గాయపడిన నలుగురుకి రూ.50 వేల చొప్పున మొత్తం 2 రెండు లక్షలు మొత్తం రూ.40 లక్షల చెక్కును అందజేశారు.

