NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

ముఖ్యమంత్రి సమావేశానికి పది విద్యార్థి..

1 min read

రాష్ట్రస్థాయి క్విజ్ పోటీలకు మాషీరా ఎంపిక..

నందికొట్కూరు, న్యూస్​ నేడు:  రాష్ట్ర స్థాయి క్విజ్ పోటీలకు నంద్యాల జిల్లా మిడుతూరు మండలం కలమందలపాడు జిల్లా పరిషత్ పాఠశాల 10 వ తరగతి విద్యార్థి దూదేకుల మాషీరా ఎంపిక అయినట్లు మిడుతూరు ఎంఈఓ-2 మల్లికార్జున నాయక్ మరియు పాఠశాల హెచ్ఎం సురేష్ కుమార్ తెలిపారు.ఈ సందర్భంగా ఎంఈఓ మాట్లాడుతూ మండల స్థాయిలో జరిగిన క్విజ్ పోటీల్లో మండలం నుండి ముగ్గురు విద్యార్థులు నియోజకవర్గ స్థాయి పోటీలకు ఎంపిక అయ్యారు.గురువారం నందికొట్కూరులో జరిగిన నియోజకవర్గ స్థాయిలో మషీరా మొదటి స్థానంలో నిలిచారు.నవంబర్ 26 న రాష్ట్రస్థాయి అమరావతిలో జరిగే రాజ్యాంగ దినోత్సవ కార్యక్రమంలో అమ్మాయి మాట్లాడనున్నారని ఈ కార్యక్రమానికి ముందుగా 3 రోజులపాటు ఎంపిక అయినవారికి శిక్షణ ఉంటుందన్నారు.ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి మరియు ఎమ్మెల్యేలు హాజరు అవుతారన్నారు.సైసావలి, దస్తగిరమ్మ కూతురు అని తండ్రి పాఠశాల చైర్మన్ గా ఉన్నారని ఎంఈఓ అన్నారు. ఈ సందర్భంగా విద్యార్థిని ఎంఈవోలు రామిరెడ్డి,సుభాన్, శ్రీనివాసులు మరియు పాఠశాల ఉపాధ్యాయులు అభినందించారు.

About Author