జిల్లాలో ఉద్యాన పంటల సాగు విస్తీర్ణాన్ని పెంచాలి
1 min read

నాబార్డు ద్వారా ఆర్ ఐ డి ఎఫ్ నిధులు వినియోగించుకోవాలి
స్టాండ్ అప్ ఇండియా పథకంపై అవగాహన కల్పించాలి
మహిళలకు స్వయం ఉపాధి కల్పనపై ప్రత్యేక దృష్టి పెట్టాలి
జిల్లా కలెక్టర్ డా.ఏ.సిరి
కర్నూలు, న్యూస్ నేడు : జిల్లాలో ఉద్యాన పంటల సాగు విస్తీర్ణాన్ని పెంచాలని జిల్లా కలెక్టర్ డా.ఏ.సిరి సంబంధిత అధికారులను ఆదేశించారు.కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్ లో 3 రోజుల పాటు 91 శాఖల అధికారులతో ఇంటరాక్టివ్ సెషన్ కార్యక్రమాన్ని నిర్వహించడంలో భాగంగా గురువారం వ్యవసాయం, ఉద్యాన, మార్కెటింగ్, సెరి కల్చర్, మార్కెటింగ్, పశు సంవర్థక, డిఆర్డీఏ, మెప్మా, నాబార్డు, ఇరిగేషన్ తదితర శాఖల అధికారులతో జిల్లా కలెక్టర్ ఇంటరాక్టివ్ సెషన్ కార్యక్రమం నిర్వహించారు.ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ నియోజకవర్గ, మండల స్పెషల్ అధికారులు వారికి కేటాయించిన మండలాలకు వెళ్లిన సమయంలో వివిధ శాఖలకు సంబంధించిన సమస్యలు పరిష్కరించాల్సి ఉంటుందని, అందువల్ల అన్ని శాఖల ద్వారా అమలవుతున్న కార్యక్రమాలు, పథకాల గురించి సంపూర్ణ అవగాహన ఉండాలనే ఉద్దేశ్యంతో ఈ కార్యక్రమాన్ని మూడు రోజుల పాటు నిర్వహించడం జరుగుతోందన్నారు.సమావేశంలో జాయింట్ కలెక్టర్ నూరుల్ కమర్, డిఆర్ఓ సి.వెంకట నారాయణమ్మ, సిపిఓ భారతి, హౌసింగ్ పిడి చిరంజీవి, జిల్లా పరిషత్ సీఈఓ నాసర రెడ్డి, కర్నూలు ఆర్డీఓ సందీప్, పత్తికొండ ఆర్డీఓ భరత్ నాయక్, జిల్లా వ్యవసాయ శాఖ అధికారి వరలక్ష్మి, పశు సంవర్థక శాఖ అధికారి శ్రీనివాస్, ఎల్ డి ఎం రామచంద్ర రావు తదితరులు పాల్గొన్నారు.


