NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

రహదారి విస్తరణకు సహకరించండి

1 min read

రహదారి విస్తరణ బాధితులతో రాష్ట్ర మంత్రి టీజీ భరత్

కిడ్స్ వరల్డ్ నుండి బుధవారపేట బ్రిడ్జి వరకు రహదారి విస్తరణ

భూమి, భవనాలు కోల్పోయే బాధితులకు నష్టపరిహారం

కర్నూలు, న్యూస్ నేడు: గురువారం నగరంలోని కిడ్స్ వరల్డ్ నుండి బుధవారపేట బ్రిడ్జి వరకు చేపట్టే రహదారి విస్తరణకు భూమి, భవన యజమానులు సహకరించాలని రాష్ట్ర పరిశ్రమలు, వాణిజ్యం, ఫుడ్ ప్రాసెసింగ్ శాఖ మంత్రి టీజీ భరత్ కోరారు. గురువారం స్థానిక ఎస్బీఐ ఎంప్లాయీస్ కాలనీలోని నగరపాలక సమావేశ భవనంలో కమిషనర్ పి.విశ్వనాథ్‌తో కలిసి రహదారి విస్తరణ బాధితులతో సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. నగరంలో ట్రాఫిక్ రద్దీ రోజురోజుకూ పెరుగుతోందని, దాన్ని తగ్గించేందుకు రహదారి విస్తరణ అవసరం ఉందన్నారు. కిడ్స్ వరల్డ్ నుండి బుధవారపేట బ్రిడ్జి వరకు రహదారి విస్తరణ ఎన్నో సంవత్సరాలుగా పెండింగ్‌లో ఉందని, బాధితులందరూ సహకరిస్తే పనులు వేగంగా పూర్తి చేయగలమని తెలిపారు. మొత్తం 180 పైగా ఆస్తులు విస్తరణలో ప్రభావితమవుతున్నాయని, ప్రస్తుతం ఉన్న రహదారిని 50 అడుగుల వరకు విస్తరించనున్నట్లు చెప్పారు. మొదటి దశలో 175 మీటర్ల వరకు విస్తరణ పనులు చేపడుతున్నామని వివరించారు.ఆస్తి కోల్పోయే బాధితులకు ఆస్తి విలువకు నాలుగు రెట్లు విలువైన టిడిఆర్ బాండ్‌లు జారీ చేస్తామని, భవనాల నష్టం విషయంలో ఆర్‌అండ్‌బి శాఖ తరపున నష్టపరిహారం అందిస్తామని తెలిపారు. పూర్తిగా ఆస్తి కోల్పోయే వారికి నగర పరిధిలోనే ప్రత్యామ్నాయ స్థల కేటాయింపు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.అభ్యంతరాలను పరిగణనలోకి తీసుకుంటామని, సందేహాలను అధికారులు నివృత్తి చేస్తారని పేర్కొన్నారు. త్వరితగతిన బాధితులు ముందుకు వస్తే, అందరికీ ఒకేసారి న్యాయం చేయడానికి వీలవుతుందన్నారు. కాబట్టి అందరూ నగరాభివృద్ధికి తోడ్పాటు అందించాలని మంత్రి కోరారు.కార్యక్రమంలో సిటీ ప్లానర్ ప్రదీప్ కుమార్, ఇంచార్జ్ ఎస్‌ఈ శేషసాయి, ఎంఈ మనోహర్ రెడ్డి, డిసిపి వెంకటరమణ, పట్టణ ప్రణాళిక అధికారి అంజాద్ బాష, సూపరింటెండెంట్ సుబ్బన్న, కార్పొరేటర్లు పరమేష్, క్రాంతి కుమార్, తదితరులు పాల్గొన్నారు.

About Author