NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

మ్యాట్రిమోనియల్ మోసాలపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలి..

1 min read

కర్నూలు జిల్లా ఎస్పీ  విక్రాంత్ పాటిల్ ఐపియస్

కర్నూలు, న్యూస్​ నేడు: ఇటీవలి కాలంలో వివాహ సంబంధిత వెబ్‌సైట్లు, మొబైల్ యాప్స్ మరియు సోషల్ మీడియా వేదికల ద్వారా పెరుగుతున్న మ్యాట్రిమోనియల్ మోసాలు కర్నూలు పోలీసుల దృష్టికి వచ్చాయని జిల్లా ఎస్పీ  తెలిపారు. ప్రేమ, పెళ్లి పేరుతో వ్యక్తిగత మరియు ఆర్థిక సమాచారం పొందే నేరగాళ్లు అమాయకుల నమ్మకాన్ని దుర్వినియోగం చేస్తున్నారన్నారు. మోసగాళ్ల మోసపూరిత పద్ధతులు:నకిలీ పేర్లతో, ఆకర్షణీయమైన ఫోటోలతో మ్యాట్రిమోనియల్ ప్రొఫైళ్లు సృష్టించడం.విదేశాల్లో ఉన్నట్లు చెప్పడం, అత్యవసర పరిస్థితుల్లో డబ్బు అవసరం అని చెప్పడం.పెళ్లికి ముందే భారీ మొత్తంలో డబ్బు డిమాండ్ చేయడం.సంబంధాన్ని నమ్మకంగా తీర్చిదిద్దిన తర్వాత వ్యక్తిగత సమాచారం/ఐడి వివరాలు సేకరించడం.నకిలీ ప్రొఫైళ్లను చూసినపుడు వాటిని మ్యాట్రిమోనియల్ సైట్లకు రిపోర్ట్ చేయండి.ఒకవేళ ఎవరైనా  సైబర్ మోసానికి గురైతే  వెంటనే సైబర్ క్రైమ్ టోల్ ఫ్రీ నెంబర్: 1930 ఆన్‌లైన్ ఫిర్యాదు కోసం: www.cybercrime.gov.in సంప్రదించాల్సిన ఆఫీస్: కర్నూలు డిస్ట్రిక్ట్ సైబర్ క్రైమ్  .ఈ తరహా మోసాల పై  ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఈ సంధర్బంగా జిల్లా ఎస్పీ శ్రీ విక్రాంత్ పాటిల్ ఐపియస్విజ్ఞప్తి చేశారు.జిల్లా పోలీసు కార్యాలయం, కర్నూలు.

About Author