మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయాలి..
1 min read

సీపీఎం పార్టీ జిల్లా కార్యదర్శి నాగేశ్వరావు డిమాండ్..
మిడుతూరు (నందికొట్కూరు) న్యూస్ నేడు : రైతులు పండించిన మొక్క జొన్నలను కొనేందుకు ప్రభుత్వం మొక్కజొన్న కేంద్రాలను ఏర్పాటు చేయాలని సీపీఎం పార్టీ జిల్లా కార్యదర్శి ఎం నాగేశ్వర రావు డిమాండ్ చేశారు.గురువారం మిడుతూరు మండల కేంద్రంలో మొక్కజొన్నలను సిపిఎం పార్టీ నాయకులు పరిశీలించారు.ఈ సందర్భంగా నాగేశ్వర రావు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం మొక్కజొన్న పంట వేయకముందు 4 నెలల క్రితం 2,400 రూ.లతో మద్దతు ధరతో కొనుగోలు చేస్తామని ప్రకటించడం మూలంగా రైతులు విస్తారంగా మొక్కజొన్న పంటను సాగు చేశారని ఎకరాకు 35 వేల రూ.లు పెట్టుబడి పెట్టి పంట పండించారని కౌలు రైతులు అదనంగా మరో 20 వేల రూ.లు భూమి కౌలుకు తీసుకొని సాగు చేసి మొక్కజొన్న పండించిన రైతు పంటను నేడు కొనుగోలు చేయకుండా ప్రభుత్వం చేతులు దులుపుకుంటుందని మొక్కజొన్న కోతలు ప్రారంభమై 20 రోజులు అవుతున్నా నేటికీ మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయకుండా కాలయాపన చేయడం విచారకరమన్నారు. ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏ పంటకు గిట్టుబాటు ధర లేక రైతులు దివాలా తీశారని ఆత్మహత్య చేసుకుంటున్నారని పొగాకు పంటను నేటికీ కొనకుండా రైతుల ఇళ్లల్లో మగ్గుతుందని కొంతమంది రైతులు పొగాకు పంటను తగలబెట్టారని ఉల్లి పంటను కొనుగోలు చేయకపోవడం మూలంగా పంట పొలాల్లో వదిలిపెట్టారని కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు.భారీ వర్షాల మూలంగా మొక్కజొన్న రైతులు పొలాల్లో వదిలిపెట్టారని కొంతమంది రైతులు మొక్కజొన్న పంటను మిషన్ల ద్వారా కోసుకొని కళ్ళల్లో రోడ్లపై ఆరబోసుకోగా వర్షాల మూలంగా మొలకలు వస్తున్నాయని వారు ఆరోపించారు.ఈ కార్యక్రమంలో ఓబులేష్, లింగస్వామి,ఉస్మాన్ భాష, పాల్గొన్నారు.

