NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

గీత కులాల మద్యం దుకాణానికి దరఖాస్తులు..

1 min read

ప్రొహిబిషన్,ఎక్సైజ్ సీఐ రామాంజనేయులు..

నందికొట్కూరు, న్యూస్ నేడు:  నంద్యాల జిల్లా పగిడ్యాల మండలంలోని గీత కులాల మద్యం దుకాణానికి దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు నందికొట్కూరు ప్రొహిబిషన్ మరియు ఎక్సైజ్ సీఐ ఎస్ రామాంజనేయులు సోమవారం సాయంత్రం తెలిపారు.జిల్లా అధికారి ఇచ్చిన గెజిట్ మేరకు10.11.2025 సా 5 గంటల లోపు పగిడ్యాల మండలంలోని గీతకులాల మద్యం దుకాణానికి దరఖాస్తులు సమర్పించవచ్చని’గౌడ’కులస్తులు మాత్రమే ధరఖాస్తులు చేసుకోవాలని అన్నారు.జిల్లాకు చెందిన వారు మాత్రమే అర్హులనిసంబంధిత మండల తహశీల్దార్ వద్ద నుండి కుల దృవీకరణ పత్రం సమర్పించాలన్నారు.ఒక్కో దరఖాస్తుకు నాన్ రిఫండబుల్ ఫీజు 2 లక్షల డిడి రూపంలో కానీ,చలానా రూపంలో కానీ సమర్పించవచ్చు.ఆన్ లైన్,ఆఫ్ లైన్ విధానములో దరఖాస్తు చేసుకోవచ్చు.2025-26 లైసెన్సు సంవత్సరమునకు రూ. 27,72,917 లైసెన్సు ఫీజు చెల్లించాలి.మరిన్ని వివరాలకుజిల్లా ప్రొహిబిషన్ మరియు ఎక్సైజ్ అధికారి ఎస్. రవికుమార్ సెల్: 8008828467, నందికొట్కూరు సీఐ రామాంజనేయులు సెల్: 9440902576 నంబర్లకు సంప్రదించవచ్చని అర్హులైన వారు దరఖాస్తులు చేసుకోవాలని సీఐ తెలిపారు.

About Author