NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

చెరుకుచెర్ల’లో ఘనంగా విగ్రహ ప్రతిష్ట..

1 min read

భారీగా తరలివచ్చిన భక్తాదులు

పూజల్లో పాల్గొన్న శివానందరెడ్డి,గౌరు,ఎమ్మెల్యే..

మిడుతూరు, న్యూస్​ నేడు: నంద్యాల జిల్లా మిడుతూరు మండల పరిధిలోని చెరుకుచెర్ల గ్రామ సమీపాన బాట దగ్గర నందికొట్కూరు-నంద్యాల ప్రధాన రహదారిలో నూతనంగా నిర్మించిన శ్రీ బాలాంజనేయ స్వామి విగ్రహ ప్రతిష్ట మహోత్సవం సోమవారం అంగరంగ వైభవంగా జరిగింది.ఉ 10:43 ని.లకు వేద పండితులు ప్రత్యేక పూజలతో ఈ కార్యక్రమం జరిగింది.ప్రత్యేక యంత్రాలతో ధ్వజ స్తంభమును ప్రతిష్టించారు. మధ్యాహ్నం గౌరు వెంకటరెడ్డి నూతన దేవాలయంలో పూజలు నిర్వహించారు. వివిధ గ్రామాల ప్రజలు మహిళలు చిన్నారులు టెంకాయలు కొడుతూ ప్రత్యేక పూజల్లో భారీగా ప్రజలు పాల్గొన్నారు.ప్రతిష్ట కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా నంద్యాల పార్లమెంట్ టీడీపీ ఇన్చార్జి మాండ్ర శివానందరెడ్డి మరియు నందికొట్కూరు ఎమ్మెల్యే గిత్త జయసూర్య హాజరై పూజలు వచ్చిన భక్తాల్తులందరికీ నిర్వహించారు.వచ్చిన భక్తా దులందరికీ మధ్యాహ్న భోజన వసతిని ఏర్పాటు చేశారు.ఈ కార్యక్రమంలో మండల కన్వీనర్లు ఖాతా రమేష్ రెడ్డి,మాండ్ర సురేంద్ర నాథ్ రెడ్డి, వంగాల శివరామిరెడ్డి,హెడ్ కానిస్టేబుల్ సుంకరి బజార్ యాదవ్, రఘురామయ్య,సర్వోత్తమ్ రెడ్డి,కమతం రాజశేఖర్ రెడ్డి, భూపాల్ రెడ్డి,పుల్లయ్య మరియు అధికారులు పాల్గొన్నారు.

About Author