NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

మెడికవర్ హాస్పిటల్ లో పిల్లల టీకాల ప్రాధాన్యతపై అవగాహన

1 min read

వరల్డ్ ఇమ్యూనైజేషన్ డే ( 10 November ) అవగాహన కార్యక్రమం – మెడికవర్ హాస్పిటల్, కర్నూలు

కర్నూలు, న్యూస్​ నేడు:  వరల్డ్ ఇమ్యూనైజేషన్ డే సందర్భంగా మెడికవర్ హాస్పిటల్, కర్నూలులో పిల్లల టీకాల ప్రాధాన్యతపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పిల్లలకు టీకాలు వేయించుకోవడం ద్వారా ప్రాణాంతక వ్యాధులను నివారించవచ్చని వైద్యులు తల్లిదండ్రులకు అవగాహన కల్పించారు.ఈ సందర్భంగా డా. కె. సింధూరా రెడ్డి (MBBS, MD Pediatrics, Fellowship in Neonatology), కన్సల్టెంట్ పీడియాట్రిషన్ & నీయోనటాలజిస్టు, మాట్లాడుతూ – “టీకాలు చిన్నారులను ప్రాణాంతక వ్యాధుల నుండి రక్షించే అత్యంత సమర్థవంతమైన మార్గం. ప్రతి శిశువు జననం నుండి నిర్దిష్ట షెడ్యూల్ ప్రకారం టీకాలు వేయించుకోవడం ద్వారా పోలియో, డిప్తీరియా, మీజిల్స్, టిటానస్ వంటి వ్యాధులను పూర్తిగా నివారించవచ్చు. తల్లిదండ్రులు తమ పిల్లల టీకా క్యాలెండర్‌ను తప్పక పాటించాలి,” అని తెలిపారు.డా. వై. గణేష్ (MBBS, DNB Pediatrics, IDPCCM, FAAI (AIIMS), F-ECMO), కన్సల్టెంట్ పీడియాట్రిక్ ఇంటెన్సివిస్ట్ మరియు పీడియాట్రిక్ ఆస్త్మా అలెర్జీ నిపుణులు, మాట్లాడుతూ – “టీకాలు చిన్నారుల రోగనిరోధక శక్తిని పెంచడంలో కీలక పాత్ర పోషిస్తాయి. ముఖ్యంగా అలెర్జీలు, ఆస్త్మా వంటి సమస్యలు ఉన్న పిల్లల్లో కూడా టీకాలు చాలా అవసరం. వ్యాక్సినేషన్ అనేది ప్రతి కుటుంబం తీసుకోవలసిన బాధ్యత. ఇది ఆరోగ్యకరమైన సమాజ నిర్మాణానికి పునాది,” అని తెలిపారు.డా. కె. అనుషా (MBBS, MD Pediatrics, MRCPCH (UK)), కన్సల్టెంట్ పీడియాట్రిషన్, మాట్లాడుతూ – “వ్యాక్సినేషన్ వల్ల కేవలం వ్యక్తిగత రక్షణ మాత్రమే కాకుండా సమాజంలో వ్యాధుల వ్యాప్తి కూడా తగ్గుతుంది. ప్రతి టీకా పిల్లల రోగనిరోధక శక్తిని బలోపేతం చేస్తుంది. వ్యాధి రాకముందే రక్షణ తీసుకోవడం పిల్లల భవిష్యత్తుకు బలమైన పునాది అవుతుంది,” అని వివరించారు.డా. కె. మమత (MBBS, MD Pediatrics), కన్సల్టెంట్ పీడియాట్రిషన్, మాట్లాడుతూ – “టీకాలు పూర్తిగా సురక్షితమైనవి మరియు శాస్త్రీయంగా నిరూపితమైనవి. తల్లిదండ్రులు అపోహలు, భయాలు దూరం చేసుకొని వైద్యుల సూచనల మేరకు టీకాలు వేయించాలి. చిన్నారుల ఆరోగ్యం సమాజ భవిష్యత్తును నిర్ణయిస్తుంది,” అని అన్నారు.క్లస్టర్ హెడ్ శ్రీ మహేశ్వర్ రెడ్డి  మాట్లాడుతూ – “వ్యాక్సినేషన్ ద్వారా ఆరోగ్యవంతమైన తరాలను నిర్మించవచ్చు. మెడికవర్ హాస్పిటల్ ప్రజల్లో వ్యాధి నిరోధక అవగాహన పెంపు కోసం నిరంతర కృషి చేస్తోంది,” అని తెలిపారు.ఈ కార్యక్రమంలో భాగంగా పిల్లల తల్లిదండ్రులు వారి అనుభవాలను పంచుకున్నారు. టీకాలు వేయించుకున్న తరువాత పిల్లల్లో వచ్చిన సానుకూల మార్పులు, ఆరోగ్యపరమైన ప్రయోజనాలు గురించి వారు మాట్లాడారు. అలాగే వైద్యుల ఆధ్వర్యంలో ప్రశ్నోత్తర కార్యక్రమం (Q&A session) కూడా నిర్వహించబడింది. ఇందులో తల్లిదండ్రులు పిల్లల టీకాల షెడ్యూల్, వ్యాక్సిన్ భద్రత, దుష్ప్రభావాలు వంటి అంశాలపై సందేహాలను వ్యక్తం చేయగా, వైద్యులు వాటిని సమగ్రంగా వివరిస్తూ తగిన సూచనలు ఇచ్చారు.

About Author