NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

స్విమ్మింగ్ క్రీడల్లో రాణించిన క్రీడాకారులను అభినందించిన  మంత్రి

1 min read

రాష్ట్ర ఫుడ్ ప్రాసెసింగ్ మరియు వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి వర్యులు. టి.జి భరత్.

కర్నూలు, న్యూస్​ నేడు: రాష్ట్ర ఫుడ్ ప్రాసెసింగ్ మరియు వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి టి.జి. భరత్ గారు సోమవారం స్థానిక కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో అండర్–17 నరసరావుపేట ల,  అండర్–19 వైజాగ్ లో,  విజయవాడలో మాస్టర్ స్విమ్మర్స్  గేమ్స్‌లో విజేతలైన 12మంది క్రీడాకారులను అభినందించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ — చదువుతో పాటు క్రీడల్లోనూ రాణించడం ఎంతో గర్వకారణం. క్రీడల ద్వారా క్రమశిక్షణ, ధైర్యం, పట్టుదల వంటి విలువలు పెంపొందుతాయి. భవిష్యత్తులో జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో మరిన్ని విజయాలు సాధించాలని ఆశిస్తున్నానన్నారు. క్రీడాకారులను సత్కరిస్తూ, వారి కోచ్‌లు మరియు తల్లిదండ్రుల కృషిని మంత్రి ప్రశంసించారు. ఈ కార్యక్రమంలో డి.ఎస్.డి.వో భూపతి రావు, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.

About Author