పట్టణ పేద మహిళల డిజిటల్ సాధికారతకు డిజి–లక్ష్మి పథకం
1 min read

జిల్లా కలెక్టర్ రాజకుమారి గణియా
నంద్యాల, న్యూస్ నేడు: రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించిన డిజి–లక్ష్మి పథకం ద్వారా పట్టణ ప్రాంతాల్లో పేద మహిళలకు, ముఖ్యంగా స్వయం సహాయక సంఘాల మహిళలకు డిజిటల్ సాధికారత మరియు స్వయం ఉపాధి అవకాశాలు కల్పించబడుతున్నాయని జిల్లా కలెక్టర్ జి. రాజకుమారి అన్నారు. సోమవారం కలెక్టరేట్లోని పిజిఆర్ఎస్ అనంతరం డిజి లక్ష్మీ పథకంపై కలెక్టర్ సమీక్షించారు.జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ఈ పథకం కింద ప్రతి పట్టణ స్థానిక సంస్థ (ULB) పరిధిలో సాధారణ సేవా కేంద్రాలు (CSCలు) ఏర్పాటు చేయబడతాయని, వీటిని అర్హత కలిగిన స్వయం సహాయక సంఘాల మహిళలు నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ పథకం ద్వారా డిజిటల్ ప్రపంచంలో భాగస్వాములై తమ జీవిత ప్రమాణాలను మెరుగుపరుచుకోవచ్చని పేర్కొన్నారు. డిజి–లక్ష్మి పథకం సమర్థవంతంగా అమలు కావడానికి సంబంధిత శాఖాధికారులు, పట్టణాభివృద్ధి సంస్థలు మరియు మహిళా సంఘాలు సమన్వయంతో పనిచేయాలని జిల్లా కలెక్టర్ ఆదేశించారు. అంతకుముందు మెప్మా పిడి వెంకట దాసు పథకం గురించి వివరించారు.

