NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

ప్రధానమంత్రి ఈ-శ్రమ కార్డు నమోదు కార్యక్రమం

1 min read

నాయి బ్రాహ్మణ సంఘం కార్మికులకు ఈ-శ్రమo పోర్టల్ లో నమోదు చేసి కార్డు అందజేత

ఉప కార్మిక కమిషనర్ పి.శ్రీనివాస్

ఏలూరుజిల్లా ప్రతినిధి,న్యూస్ నేడు: ప్రధాన మంత్రి ఇ-శ్రమ కార్డు నమోదు కార్యక్రమములో బాగంగా మంగళవారం గవరవరం,శనివారపుపేట గ్రామం, ఏలూరు నగరం లో నాయి బ్రాహ్మణా సంఘం లోని కార్మికులను మంగళవారం ఇ –శ్రమ పోర్టల్ లో నమోదు చేయంచి, వారికీ గుర్తిపు కార్డులను ఇవ్వడం జరిగిందని ఉప కార్మిక కమీషనర్ పీ.శ్రీనివాస్ తెలిపారు. ఈ నమోదు ప్రక్రియలో జి.వి రమణ ,జె.గోపాల కృష్ణ ఒకటవో సర్కిల్, మరియు రెండోవ సర్కిల్ సహాయ కార్మిక అధికార్లు, ఏలూరు వారు పాల్గొనటం జరిగినది.అసంఘటిత  రంగంలో పని చేసే ప్రతి కార్మికులు ఉచితంగా https://eshram.gov.in వారి వారి అధర్ కార్డు నెంబర్ ,బ్యాంకు ఖాతా నెంబర్ ,ఫోన్ నెంబర్ తో నమోదు చేసుకోవచ్చని ఆయన తెలిపారు.  కేంద్ర ప్రభుత్వం వారు కల్పించే ప్రమాద భీమ పథకంలో  అసంఘటిత  రంగంలోని కార్మికులందరూ  నమోదు చేసుకోమని ఆయన తెలిపారు.

About Author