NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

ప్రజల పక్షాన పోరాడుతూనే ఉంటాం..

1 min read

మెడికల్ కాలేజీలను ప్రభుత్వమే కొనసాగించాలి

నందికొట్కూరు వైసీపీ ఇన్చార్జి డాక్టర్ సుధీర్..

నందికొట్కూరు, న్యూస్​ నేడు: పేద ప్రజల పక్షాన నిరంతరం పోరాడుతూనే ఉంటామని నందికొట్కూరు వైసీపీ ఇన్చార్జి డాక్టర్ ధారా సుధీర్ అన్నారు. నంద్యాల జిల్లా నందికొట్కూరు పట్టణంలో బుధవారం మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా  డాక్టర్ సుధీర్ ఆధ్వర్యంలో కార్యకర్తలతో కలిసి ధర్నా చేపట్టారు.పట్టణంలోని మిడుతూరు రోడ్డులో ఉన్న అంబేద్కర్ విగ్రహానికి నివాళులు అర్పించారు.అక్కడి నుండి తహసిల్దార్ కార్యాలయం వరకు ధర్నా చేపట్టారు. రెవెన్యూ అధికారులకు వినతిపత్రం అందజేశారు.ఈ సందర్భంగా డాక్టర్ సుధీర్ మాట్లాడుతూ గత ప్రభుత్వ హయాంలో వైయస్ జగన్ రాష్ట్రంలో 17 మెడికల్ కాలేజీలను తీసుకువచ్చి వాటిని పూర్తి చేశారని ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ కాలేజీలను ప్రైవేటీకరణ చేయాలని చూస్తోందని అంతేకాకుండా గ్రామాల్లో కోటి సంతకాల్లో భాగంగా ప్రజల సంతకాలు చేయించామని అన్నారు.కూటమి ప్రభుత్వం బడా బాబులకు,వారి తెలుగుదేశం పార్టీ నాయకులకు ప్రైవేట్ చేతుల్లో పెట్టాలని చూస్తున్నారని మెడికల్ కాలేజీల్లో కూటమి ప్రభుత్వం హెల్త్ స్కామ్ చేస్తుందన్నారు.ప్రభుత్వమే కాలేజీలను నడిపితే సీట్లు అధికంగా ఉండడం వల్ల పేద ప్రజలు వైద్య విద్య చేయడానికి అవకాశం ఉందని డాక్టర్ సుధీర్ అన్నారు. వెంటనే ప్రభుత్వం ప్రైవేటీ కరణను ప్రేమించుకొని ప్రభుత్వమే నడపాలని లేనిపక్షంలో పార్టీ ఆధ్వర్యంలో వీటిపై ప్రజలకు వివరిస్తూ ఉద్యమిస్తామని ఆయన హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో జడ్పిటీసీలు పర్వత యుగంధర్ రెడ్డి, జగదీశ్వర్ రెడ్డి నాయకులు మన్సూర్,జబ్బార్,మాధురి, రమేష్ నాయుడు,లోకేశ్వర్ రెడ్డి,తులసి రెడ్డి,సర్పంచ్ జనార్ధన్,సాంబశివుడు,అన్వర్ భాష తదితరులు పాల్గొన్నారు.

About Author