ఫలిస్తున్న ఏలూరు జిల్లా ఎంపీ పుట్ట మహేష్ కుమార్ కృషి
1 min read

తరలి వస్తున్న పరిశ్రమలు,ఫుడ్ ప్రాసెసింగ్ హబ్ గా ఏలూరు జిల్లా
పట్టుబట్టి సాధిస్తున్న ఎంపీ పుట్టా
రైతులకు గిట్టుబాటు ధర, యువతకు ఉపాధి కల్పనే ధ్యేయం
బహుళ ప్రయోజనంగా ఫుడ్, ఎంఎస్ఎంఈ పార్కులు
ఏలూరుజిల్లా ప్రతినిధి,న్యూస్ న్యూస్ నేడు: ఏలూరు జిల్లాను పరిశ్రమల కేంద్రంగా, ముఖ్యంగా ఫుడ్ ప్రాసెసింగ్ హబ్ గా తీర్చిదిద్దాలనే ధ్యేయంతో ముందుకు వెళ్తున్నామన్నారు ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ కుమార్ వెల్లడించారు. వెల్లడించారు.ఏలూరు పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో మంగళవారం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేతుల మీదుగా ఎంఎస్ఎంఈ పార్కుకు ప్రారంభోత్సవం, మంత్రుల చేతుల మీదుగా రెండు పరిశ్రమలకు శంకుస్థాపన జరిగిన సందర్భంగా ఆనందం వ్యక్తం చేస్తూ ఎంపీ పుట్టా మహేష్ కుమార్ ఒక ప్రకటన విడుదల చేశారు. రైతులకు మేలు చేయడంతో పాటు, యువతకు ఉద్యోగ ఉపాధి కల్పనే లక్ష్యంగా తాను, ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి నారా లోకేష్ కృషి చేస్తున్నామన్నారు.జిల్లాలో ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమల ఏర్పాటు కోరుతూ గత ఏడాది నవంబర్ లో తాను కేంద్ర ఆహార శుద్ధి పరిశ్రమల మంత్రిత్వ శాఖ కార్యదర్శి అనిత ప్రవీణ్ ను కలిసి విజ్ఞప్తి చేసిన విషయాన్ని ఈ సందర్భంగా ఎంపీ గుర్తు చేశారు.ఏలూరు పార్లమెంట్ నియోజకవర్గాన్ని పారిశ్రామికంగా అభివృద్ధి చేయడానికి సహకరించాలని, జిల్లాలో పరిశ్రమల ఏర్పాటుకు ప్రాధాన్యత ఇవ్వాల్సిందిగా కోరుతూ ఈ ఏడాది ఏప్రిల్ లో నూజివీడు నియోజకవర్గం ఆగిరిపల్లిలో జీరో పావర్టీ- పీ4 ప్రారంభోత్సవ ప్రజావేదిక కార్యక్రమంలో తాను ముఖ్యమంత్రి చంద్రబాబు కి విజ్ఞప్తి చేసిన విషయాన్ని కూడా ఈ సందర్భంగా ఎంపీ గుర్తు చేశారు.తాజాగా మంగళవారం నాడు చింతలపూడి మండలం పట్టాయగూడెంలో 65 ఎకరాలలో ఏర్పాటు చేస్తున్న ఎంఎస్ఎంఈ పార్కుకు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు శంకుస్థాపన చేయటం సంతోషం కలిగించిందన్నారు ఎంపీ.అంతేగాకుండా గ్రామీణ ప్రాంతాల్లోని స్థానికులకు ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి పెరుగుతుందని, తద్వారా గ్రామీణ ప్రాంత యువత వలస వెళ్ళడాన్ని తగ్గిస్తుందని ఎంపీ పుట్టా మహేష్ కుమార్ తెలిపారు.జిల్లాకు అన్ని రకాల పరిశ్రమలు తీసుకురావడంతోపాటు, ఏలూరు పార్లమెంటు నియోజకవర్గాన్ని ప్రత్యేకంగా ఫుడ్ ప్రాసెసింగ్ హబ్‌గా మార్చడానికి తాను పూర్తి స్థాయిలో కృషి చేస్తానన్నారు. ఎంపీ. నేవీ డిపో కల కూడా త్వరలోనే సాకారమవుతుందన్నారు. ఈ సందర్భంగా తన విజ్ఞప్తులు మన్నించి జిల్లాకు పరిశ్రమలు మంజూరు చేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కి, ప్రత్యేకంగా మొర్సపూడి మెగా ఫుడ్ పార్కు రావడానికి కారణమైన యువ నేత నారా లోకేష్ కి, పరిశ్రమల స్థాపనకు అన్ని విధాలా సహకరిస్తున్న గౌరవ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి తన తరపున, ఏలూరు పార్లమెంటు నియోజకవర్గ ప్రజల తరపున కృతజ్ఞతలు తెలుపుతున్నట్లు తెలిపారు.


