ప్రధానమంత్రి ఈ-శ్రమ కార్డు నమోదు కార్యక్రమం
1 min read

నాయి బ్రాహ్మణ సంఘం కార్మికులకు ఈ-శ్రమo పోర్టల్ లో నమోదు చేసి కార్డు అందజేత
ఉప కార్మిక కమిషనర్ పి.శ్రీనివాస్
ఏలూరుజిల్లా ప్రతినిధి,న్యూస్ నేడు: ప్రధాన మంత్రి ఇ-శ్రమ కార్డు నమోదు కార్యక్రమములో బాగంగా మంగళవారం గవరవరం,శనివారపుపేట గ్రామం, ఏలూరు నగరం లో నాయి బ్రాహ్మణా సంఘం లోని కార్మికులను మంగళవారం ఇ –శ్రమ పోర్టల్ లో నమోదు చేయంచి, వారికీ గుర్తిపు కార్డులను ఇవ్వడం జరిగిందని ఉప కార్మిక కమీషనర్ పీ.శ్రీనివాస్ తెలిపారు. ఈ నమోదు ప్రక్రియలో జి.వి రమణ ,జె.గోపాల కృష్ణ ఒకటవో సర్కిల్, మరియు రెండోవ సర్కిల్ సహాయ కార్మిక అధికార్లు, ఏలూరు వారు పాల్గొనటం జరిగినది.అసంఘటిత రంగంలో పని చేసే ప్రతి కార్మికులు ఉచితంగా https://eshram.gov.in వారి వారి అధర్ కార్డు నెంబర్ ,బ్యాంకు ఖాతా నెంబర్ ,ఫోన్ నెంబర్ తో నమోదు చేసుకోవచ్చని ఆయన తెలిపారు. కేంద్ర ప్రభుత్వం వారు కల్పించే ప్రమాద భీమ పథకంలో అసంఘటిత రంగంలోని కార్మికులందరూ నమోదు చేసుకోమని ఆయన తెలిపారు.

