NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

శ్రీ మఠం లో బంగారు పల్లకి సేవ

1 min read

మంత్రాలయం న్యూస్ నేడు :  ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన మంత్రాలయం శ్రీ రాఘవేంద్ర స్వామి మఠంలో బుధవారం  ఉదయం శ్రీ రాఘవేంద్ర స్వామి బృందావనం అర్చకులు  జయతీర్థ,శ్రీకాంత్,కపీల్, వేదవ్యాస స్వామి,సహాయ పీఆర్వో హోన్నళ్ళి వ్యాసరాజ్ ఆచార్ ఆధ్వర్యంలో మృత్తికా బృందావనాన్ని బంగారు పల్లకి లో ఉంచి అశేష జనవాహిని నడుమ, భాజా భజంత్రీల నడుమ, మంగళ వాయిద్యాల నడుమ, నమో రాఘవేంద్ర నామస్మరణతో శ్రీ మఠం ప్రాంగణంలో ఘనంగా ఊరేగించారు. ప్రవచన మండపంలో బంగారు పల్లకి సేవ చేయించిన భక్తుల పేరు,గోత్ర నామాల పై సంకల్ప పూజలు నిర్వహించారు.సేవ చేయించిన భక్తులకు విశేష దర్శన భాగ్యం కల్పించారు.వీరికి శ్రీ మఠం పీఠాధిపతి శ్రీ సుభుధేంద్ర తీర్థ స్వామీజి వారు శేష వస్త్రం, పుష్ప,ఫల, మంత్రాక్షితలు ఇచ్చి ఆశీర్వదించారు. ఈ కార్యక్రమంలో శ్రీ మఠం దివాన్, సెక్యూరిటీ సూపర్వైజర్లు, సెక్యూరిటీ సిబ్బంది, భక్తులు తదితరులు పాల్గొన్నారు.

About Author