NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

సీనియర్ న్యాయవాదిపై దాడి అమానుషం   

1 min read

కోసిగి, న్యూస్​ నేడు: తిరుపతిలో సీనియర్ న్యాయవాది రాజశేఖర్ పై కక్షిదారులు దాడి చేయడం అమానుషమైన చర్య అని పత్తికొండ న్యాయవాదుల సంఘం అధ్యక్షులు వై మధు బాబు అన్నారు. ఈ మేరకు న్యాయవాదిపై దాడిని నిరసిస్తూ బుధవారం స్థానిక న్యాయవాదుల సంఘం ఆధ్వర్యంలో విధులను బహిష్కరించి స్థానిక నాలుగు స్తంభాల కూడలి వద్ద రాస్తారోకో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఈ నెల ఏడవ తేదీన  తిరుపతి సీనియర్ న్యాయవాది రాజశేఖర్ పై ఓ కక్షిదారుడు పుత్తూరు కోర్టు ప్రాంగణంలో కారుతో గుద్ది చంపడానికి ప్రయత్నించిన సంఘటనను అందరూ ఖండించాలన్నారు. న్యాయవాదుల సంఘం అధ్యక్షుడు ఇలాంటి సంఘటనలు జరగకుండా న్యాయవాదులకు రక్షణ చట్టం తీసుకువచ్చి పకడ్బందీగా అమలు చేయాలని డిమాండ్  చేశారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి రాష్ట్రంలో జరుగుతున్న దాడులను గుర్తించి న్యాయవాదులకు రక్షణ చట్టం అమలు చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో సీనియర్ మరియు జూనియర్ న్యాయవాదులు పాల్గొన్నారు.

About Author