NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

పెదపాడు శాఖ గ్రంధాలయంలో 58వ జాతీయ గ్రంథాల వారోత్సవాలు

1 min read

పుస్తక ప్రదర్శన ప్రారంభించినహెచ్ఎం పి.వెంకటేశ్వరరావు

 విద్యార్థి దశలో చెడు వ్యసనాలకు లోను కాకుండా మంచి చదువులు చదవాలి

ఏలూరుజిల్లా ప్రతినిధి,న్యూస్ నేడు : పెదపాడు శాఖా గ్రంధాలయం నందు 58వ జాతీయ గ్రంథాలయ వారోత్సవంలో భాగంగా ఈరోజు  శనివారం “పుస్తక ప్రదర్శన” ఏర్పాటు చేయడం జరిగినది. ఈ పుస్తక ప్రదర్శన పెదపాడు జెడ్ పి. హెచ్ హెచ్.ఎమ్  పి.వెంకటేశ్వరరావు ప్రారంభించినారు. ఆయన మాట్లాడుతూ గ్రంథాలయంలో పుస్తకాల ప్రాముఖ్యత గురించి విద్యార్థులకు వివరించి, గ్రంథాలయంలోని పుస్తకాలు ప్రతి ఒక్కరూ చదివి విజ్ఞానవంతులు కావాలని కోరినారు. తరువాత “మారకద్రవ్యాల నిర్మూలనపై” అవగాహన కార్యక్రమం పెదపాడు జెడ్.పి.హెచ్ స్కూల్ సోషల్ మాస్టారు బి. నాగరాజు మాట్లాడుతూ విద్యార్థులు చెడు వ్యసనాలకు లోను కాకుండా ఉన్నత విద్యను అభ్యసించాలని, విద్యార్థిని విద్యార్థులకు చుట్ట, బీడీ ,సిగరెట్, పాన్ పరాగ్,గుట్కా వంటి మారకద్రవ్యాల జోలికి పోకూడదు వాటి వల్ల నష్టాలు గురించి విపులంగా అర్థమయ్యే రీతిగా తెలియపరిచినారు. అనంతరం నాలుగు, ఐదు తరగతుల వారికి “చిత్రలేఖనా పోటీలు” ఎం.పీ.పీ స్కూల్ హెచ్.ఎమ్  పి. అంజనాదేవి, గురుకుల పాఠశాల హెచ్.ఎమ్ ఆర్. బెంజిమెన్ నిర్వహించినారు.ఈ కార్యక్రమం అంతయు గ్రంథాలయాధికారి దుగ్గిపోగు జాన్ బాబు పర్యవేక్షణలో నిర్వహించుట జరిగినది.వచ్చిన అతిథులకు కృతజ్ఞతలు తెలియజేసినారు. పాల్గొనిన విద్యార్థిని ,విద్యార్థులకు స్నాక్స్ పంచిపెట్టడం జరిగినది.

About Author