NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

జిల్లా ఎస్పీ ఆదేశాలతో కోర్టు మానిటరింగ్ సభ్యులతో సమీక్ష

1 min read

న్యాయస్థానంవిచారణలో ఉన్న కేసులు వేగవంతం చేయాలి

జిల్లా అదనపు ఎస్పీ (అడ్మిన్) ఎన్.సూర్యచందర్రావు

ఏలూరు, న్యూస్​ నేడు: ఏలూరు జిల్లా ఎస్పీ కె.ప్రతాప్ శివ కిషోర్ ఐపీఎస్ యొక్క ఆదేశాలపై ఏలూరు జిల్లా అదనపు ఎస్పీ అడ్మిన్ ఎన్.సూర్య చంద్రరావు ఏలూరు కోర్టు మానిటరింగ్ సెల్ సభ్యులతో విచారణలో ఉన్న కేసు లపై సమీక్ష,న్యాయ స్థానాలలో  విచారణ ఉన్న కేసు లు వేగవంతం చేయుట కొరకు కోర్టు మానిటరింగ్ సిబ్బందికి ఆదేశాలు జారీ చేశారు. శనివారంజిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయం లోని సమావేశ మందిరంలో కోర్టు మానిటరింగ్ సభ్యులతో కీలక సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో జిల్లా అదనపు ఎస్పీ అడ్మిన్ గారు కోర్టు మానిటరింగ్ సిబ్బంది పని తీరును అడిగి తెలుసుకున్నారు.అదనపు ఎస్పీ అడ్మిన్ ఏలూరు, జంగారెడ్డి గూడెం, నూజివీడు, పోలవరం సబ్ డివిజన్‌లకు చెందిన కోర్టు మానిటరింగ్ సభ్యులతో  మాట్లాడుతూ కేసులు యొక్క విచారణ వేగవంతం చేయుట కొరకు తగిన సూచనలు సలహాలు మరియు ఆదేశాలు ఇచ్చినారు.ఏలూరు జిల్లా లో కోర్టు మోనిటరింగ్ సెల్ ఏర్పాటు చేసిన దగ్గర నుంచి ఇప్పటి వరకు  మొత్తం 41 కేసులలో శిక్షలను విధించిన  న్యాయ మూర్తులు  అందులో “19 జీవిత ఖైదీ శిక్ష లు”,  03 కేసులలో 20 సంవత్సరాలు ముద్దాయిలకు శిక్షలు, 8 కేసులలో 10 సంవత్సరాలు జైలు శిక్ష, 03 కేసులలో ఏడు సంవత్సరాలు జైలు శిక్ష, 05 కేసులలో మూడు సంవత్సరాలు జైలు శిక్ష, 01 కేసులో నాలుగు సంవత్సరాము పాటు జైలు శిక్ష విధించిన న్యాయమూర్తులు  వారు అదే స్పూర్తి తో సిబ్బంది  పని చేయాలి అని అదనపు ఎస్పీ అడ్మిన్  తెలియ చేసినారు. కేసుల పర్యవేక్షణ కోర్ట్ మానిటరింగ్ సెల్ సభ్యులు వ్యక్తి గతంగా తాము నిర్వర్తించే విధులు, విచారణలో ఉన్న కేసుల వివరాలు గురించి అడిగి తెలుసుకున్నారు.అధికారులు ప్రతి కోర్టులో న్యాయ విచారణలో ఉన్న కేసుల వివరాలను ఎప్పటి కప్పుడు సమీక్షించాలని ఆదేశించారు.ఈ కార్యక్రమములో  డీ.సీ.ఆర్.బి  సిబ్బంది మరియు కోర్ట్ మానిటరింగ్ సెల్ సభ్యులు పాల్గొన్నారు.

About Author