సాగునీటి సమస్యలపై సిపిఎం విస్తృత పోరాటం
1 min read

హంద్రీనీవా కు పంట కాలువల నిర్మాణం చేపట్టి 46 ఎకరాలకు సాగునీరు ఇవ్వాలి
గుండ్లకొండ దగ్గర స్లూయిస్ ఏర్పాటు చేసి కోటకొండ వరకు సాగునీరు ఇవ్వాలి… సిపిఎం..
పత్తికొండ, న్యూస్ నేడు: కర్నూలు జిల్లా దేవనకొండ మండలంలోని సాగునీటి సమస్యలపై విస్తృత పోరాటాలకు మండల రైతాంగం ప్రజానికం సిద్ధంగా ఉండాలని సిపిఎం పార్టీ జిల్లా కార్యవర్గ సభ్యులు జిల్లా నాయకులు వీరశేఖర్ జిల్లా రైతాంగానికి పిలుపునిచ్చారు. అందులో భాగంగా ఈనెల 18 వ తేదీన తెర్నేకల్ గ్రామం నుండి దేవనకొండ మండల కేంద్రం వరకు బైక్ యాత్ర చేపట్టి 19 న దేవనకొండ మండల కేంద్రంలో రైతాంగంతో కలిసి నిరసన కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు వారు పేర్కొన్నారు. శనివారం నాడు తెర్నేకల్ గ్రామంలో అ పార్టీ కార్యాలయం నందు పార్టీ మండల కమిటీ సభ్యులు మహబూబ్ బాషా అధ్యక్షతన పార్టీ ,ప్రజాసంఘాల కార్యకర్తల సమావేశం జరిగింది ఈ సందర్భంగా వెంకటేశులు, వీర శేఖర్ లు మాట్లాడుతూ, అంగట్లో అన్నీ ఉన్న అల్లుడి నోట్లో శని ఉన్నట్లు దేవనకొండ మండలం చుట్టూ సాగునీటి వనరులు ఉన్న ఇప్పటికీ సరైన సాగునీటి సదుపాయం లేదని ఈ నేపథ్యం లోనే వరుస కరువులు మండలాన్ని ,రైతలను నష్టపరుస్తున్నాయని పేర్కొన్నారు హంద్రీనీవా నుండి రావాల్సిన 46 వెల ఎకరాలకు సాగునీరు పంట కాలువలు లేకపోవడం ,అదే విధంగా మండలంలో కరివేముల, తెర్నేకల్లు, కప్పట్రాళ్ల గ్రామాల మధ్యన హంద్రీనీవా ప్రధాన కాలువ పెండింగ్ పనులు ఉండడం వలన మండలానికి సాగునీరు సక్రమంగా రావడం లేదని పేర్కొన్నారు పంట కాలువలు లేకపోతే సాగునీరు ఎట్లా రైతులు కందుతుందని పంట కాలువలు విషయంలో ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదని వారు విమర్శించారు వెంటనే పంట కాల్వల నిర్మాణం చేపట్టాలని హంద్రీనీవా పెండింగ్ పనులు పూర్తి చేయాలని వారు డిమాండ్ చేశారు.

