NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

రబీ సీజన్ కు వరి నారుమల్లను సిద్ధం చేస్తున్న రైతులు

1 min read

మహానంది,న్యూస్​ నేడు: రబీ సీజన్ కు సంబంధించి వరి నారుమళ్ళను రైతులు సిద్ధం చేస్తున్నారు. ఖరీఫ్ సీజన్లో వేసిన వరి పంట సకాలంలో చేతికి రాక తుపాన్లు గాలుల వల్ల నేల వాలిన సంగతి విధితమే. ఇంతవరకు ప్రభుత్వం నుండి తుపానులు, వరదల కారణంగా దెబ్బతిన్న పంటలకు ప్రభుత్వం నుండి ఎలాంటి ఆర్థిక సహాయ సహకారాలు అందలేదని రైతులు వాపోతున్నారు. ఖరీఫ్ సీజన్ లో పండించిన  వరి కి కనీస గిట్టుబాటు ధర కూడా అందడం లేదని దిగుబడి కూడా తగ్గిపోయిందని అంటున్నారు. ఇవన్నీ మర్చిపోయిన రైతన్న రబీ సీజన్లో అయినా వరి పండిస్తే మంచి దిగుబడి, ధర రాకపోదా అనే ఆశతో సాగుకు సిద్ధమవుతున్నారు. మరోవైపు రైతులను రబి సీజన్లో వేసే పంటలకు సకాలంలో ప్రభుత్వం యూరియా సరఫరా చేస్తుందా లేక ఖరీఫ్ సీజన్లో యూరియా కోసం పడిన పాట్లు పడాల్సి వస్తుందా అనే మీమాంసలో రైతులు ఉన్నట్లు తెలుస్తుంది. మరి ప్రభుత్వం, ఉన్నత స్థాయి అధికారులు యూరియా పై ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు అనేది తెలియాల్సి ఉంది. రబీ సీజన్ ప్రారంభంలోనే సరైన చర్యలు తీసుకుంటే యూరియా కొరత ఏర్పడదని లేకుంటే ఇబ్బందులు పడాల్సి వస్తుందని రైతులు తెలియజేస్తున్నారు.

About Author