హత్యాయత్నం కేసులో ముద్దాయిల అరెస్టు..
1 min read

మిడుతూరు ఎస్ఐ ఓబులేష్..
మిడుతూరు,(నందికొట్కూరు) న్యూస్ నేడు: ఓ వ్యక్తిపై హత్యాయత్నం చేసిన కేసులో ముగ్గురు ముద్దాయిలను అరెస్టు చేసి రిమాండ్ కు పంపినట్లు మిడుతూరు ఎస్ఐ హెచ్ ఓబులేష్ సోమవారం సాయంత్రం తెలిపారు.ఎస్సై తెలిపిన వివరాల మేరకు నంద్యాల జిల్లా మిడుతూరు మండల పరిధిలోని కడుమూరు గ్రామానికి చెందినముద్దాయిలు 1.బూసిగారి రామలక్ష్మి రెడ్డి(45),2) బూసిగారి వెంకట రమణా రెడ్డి (48),3) బూసిగారి శ్రీనివాస రెడ్డి (70)వీరిని వీరి ఇంటి దగ్గర ఉండగా ఉదయం అరెస్టు చేసి నందికొట్కూరు కోర్టులో హాజరు పరచగా మెజిస్ట్రేట్ ఈనెల 28 వరకు నిందితులకు రిమాండ్ విధించినట్లు ఎస్సై తెలిపారు. గత ఆగస్టు 31వ తేదీన పుసులూరు గ్రామానికి చెందిన పల్లె హనుమంత రెడ్డి భార్య స్వగ్రామం కడుమూరులో గత కొన్ని రోజులుగా నివాసం ఉంటున్నారు.నిందితులు ముగ్గురూ కట్టెను కాల్చి హనుమంత రెడ్డి శరీరంపై కాల్చారు.అప్పట్లో ముగ్గురిపై అత్యాయత్నం కేసు నమోదు అయినట్లు ఎస్సై తెలిపారు. అలజడులు చేయాలని చూస్తే ఎంతటి వారినైనా ఉపేక్షించేది లేదని ఎస్ఐ తెలిపారు.ఈ కార్యక్రమంలో ఏఎస్ఐ సుబ్బయ్య,సిబ్బంది చెన్నయ్య,ఇస్మాయిల్ పాల్గొన్నారు.

