బ్రాహ్మణ సంఘం నూతన అధ్యక్షుడిగా:రాజశేఖర్ రావు
1 min read

ప్యాపిలి న్యూస్ నేడు: గుత్తి మండల గౌతమి గాయత్రి బ్రాహ్మణ సంఘం నూతన అధ్యక్షులుగా బసినేపల్లి గ్రామానికి చెందిన రాజశేఖర్ రావు ఏకగ్రీవంగా ఎన్నికవ్వడంతో వివిధ పార్టీల నాయకులు, బ్రాహ్మణ సంఘీయులు , మిత్రులు, శ్రేయోభిలాషులు పరోక్షంగా, ప్రత్యక్షంగా ఆయనకు అభినందనలు తెలియజేశారు. సోమవారం వైసిపి ఐటీ విభాగం జిల్లా అధ్యక్షులు రాజశేఖర్ రెడ్డి నూతన అధ్యక్షులు రాజశేఖర్ రావును మర్యాదపూర్వకంగా కలిసి శాలువా, పూలమాలలతో సన్మానించి ప్రత్యేక అభినందనలు తెలియజేశారు భవిష్యత్తులో అత్యున్నత పదవులు అధిరోహించాలని అభిలాషించారు . బ్రాహ్మణుల అభివృద్ధికి, పూజారుల సంక్షేమానికి కృషి చేయాలని నూతన అధ్యక్షులకు సూచించారు. ఈ సందర్భంగా నూతన అధ్యక్షులు రాజశేఖర్ రావు మాట్లాడుతూ ఈ పదవి తనపై మరింత బాధ్యతను పెంచిందని, బ్రాహ్మణుల సంక్షేమానికి కృషి చేస్తానని పేర్కొన్నారు.


