NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

న్యాయ సేవాది అధికార సంస్థ ఎల్లప్పుడు వృద్ధులకు అండగా ఉంటుంది

1 min read

కర్నూలు, న్యూస్​ నేడు:  జిల్లా న్యాయ సేవాధికార సంస్థ  చైర్మన్ మరియు జిల్లా జడ్జి శ్రీ జి. కబర్థి  సూచనల మేరకు కార్యదర్శి బి.లీలా వెంకట శేషాద్రి  సోమవారం   కర్నూల్ బి క్యాంపు నందు గల మన వృద్ధుల ఆశ్రమం లో తల్లిదండ్రుల మరియు వయో వృధా పౌరుల భరణ పోసిన మరియు సంక్షేమ చట్టం 2007 పై అవగాహన కల్పించారు. ఈ చట్టం ప్రకారం తల్లిదండ్రుల సంరక్షణ పట్టించుకోకుండా వారిని వీధులలో వదిలివేసిన వారిపై క్రిమినల్ ప్రొసీజర్ ప్రకారము మూడు నెలలు జైలు శిక్ష మరియు ఐదువేల రూపాయల జరిమానా విధించబడును తెలిపారు. పిల్లలు పట్టించుకోని  తల్లిదండ్రులు వారి పిల్లలపై మెయింటెనెన్స్ కేసులు వేసి వారి నుండి తమ జీవనానికై భరణాన్ని పొందవచ్చునని తెలిపారు.  వృద్ధులకు ఎవరికైనా న్యాయ సహాయం కావాలంటే నేరుగా జిల్లా న్యాయ సేవ అధికార సంస్థను గాని లేదా   టోల్ ఫ్రీ నెంబర్. 15100 కైనా ఫోన్ చేసి వారి సమస్యను తెలుపు కోవచ్చని తెలిపారు. వారి తరపున ఉచిత న్యాయవాదిని నియమించి వారి సమస్య లను పరిష్కారిస్తా మని తెలిపారు.జిల్లా న్యాయ సేవాది అధికార సంస్థ ఎల్లప్పుడు వృద్దులకు అండగా ఉంటుందని తెలిపారు.ఈ ఈ కార్యక్రమంలో  లీగల్ ఎయిడ్ మెంబర్ డాక్టర్ రాయపాటి శ్రీనివాసులు, న్యాయవాది పాపారావు, కర్నూలు పెన్షనర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ మద్దిలేటి,మెంబెర్స్ శంకరప్ప, మభూష, ఆశ్రమ నిర్వాహకులు వృద్ధులు పాల్గొన్నారు.

About Author